Tuesday, April 30, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి దాదాపు 20 గంటలు..

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ వారాంతం రావడంతో పెరిగింది. దీంతో దర్శనానికి దాదాపు 20 గంటలు సమయం పడుతోంది. వారాంతం, వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో రోడ్డు మార్గాన, నడక మార్గాలలో భక్తులు తండోపతండాలుగా తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో ఎటు చూసినా భక్తులే దర్శన మిస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్సు 1,2లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూలైన్‌లు వెలుపలకు వ్యాపించాయి. భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచివున్నారు. ఇక కాలినడకన భక్తులు ప్రవాహంలా తిరుమలకు తరలి వస్తున్నారు.

తమ మొక్కులు చెల్లింపులో భాగంగా పెద్ద సంఖ్యలో నడక మార్గంలో భక్తులు తరలి వస్తుండడంతో కాలినడకన వచ్చే భక్తులకు కేటాయించే దివ్యదర్శన టోకెన్ల జారిని రద్దు చేయడంతో కాలినడకన తిరుమలకు చేరుకుంటున్న భక్తులు సర్వదర్శన ద్వారానే శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉండడంతో క్యూ లైన్‌లు అంతకంతకు పెరిగి పోతున్నాయి. కాగా క్యూ లైన్‌లో విచివున్న భక్తులకు అన్నప్రసాదం విభాగం అధికారులు శ్రీవారి సేవకుల సహాయంతో ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, అల్పాహారం, తాగునీరు నిరంతరాయంగా అందచేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement