Saturday, May 18, 2024

AP | సీఏఏ అమలు తప్పు కాదు : చంద్రబాబు నాయుడు

లోక్ సభ ఎన్నికల రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ని దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ చట్టంలో ముస్లింలను మినహాయించడంపై వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ చట్టానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మద్దతు పలికారు.

సీఏఏ అమలులో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు. ప్రతి దేశానికి దాని స్వంత పౌరసత్వ చట్టం ఉంటుంది. అందులో తప్పేముంది అని చంద్రబాబు నాయుడు అన్నారు. మ‌రోవైపు CAAలో సవరణలు మత ప్రాతిపదికన జరిగాయని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement