Friday, June 14, 2024

AP | అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ఆ జీతాలు చెల్లించనున్నట్టు ఉత్తర్వులు జారీ!

ఏపీలోని అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత ఏడాది డిసెంబర్ 12వ తేదీ నుంచి ఈ ఏడాది జనవరి 22వ తేదీ వరకు వేతనాల పెంపుతో సహా పలు డిమాండ్లతో అంగన్వాడీలు సమ్మె చేశారు. మొత్తం 42 రోజులపాటు అంగన్వాడీలు సమ్మెను కొనసాగించారు. కాగా, ఈ 42 రోజుల సమ్మె కాలాన్ని డ్యూటీలో ఉన్నట్లుగా పరిగణిస్తూ జీతాలు చెల్లించనున్నట్టు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సమ్మె కాలాన్ని చెల్లించే జీతంలో కోత విధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement