Tuesday, April 30, 2024

AP : పొలిటికల్ బాండ్ల పేరుతో అక్రమార్కులు..రిటైర్డ్ జ‌డ్జీకే టోక‌రా…

పొలిటికల్ బాండ్ల పేరుతో కొందరు అక్రమార్కులు రెచ్చిపోయారు. మంచి బెనిఫిట్స్ ఉన్నాయంటూ నమ్మించి భారీ వ‌సూలుకు పాల్ప‌డుతున్నారు. తాజాగా ఏకంగా రిటైర్డ్ జడ్జీకే టోకరా వేశారు. పొలిటికల్ బాండ్ల పేరిటీ ఓ ప్రధాన పార్టీల విరాళాలు ఇవ్వడంతో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయని నమ్మించి కేటుగాళ్లు ఘరానా మోసానికి పూనుకున్నారు.

ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి కుటుంబం సభ్యుల నుంచి నరేంద్ర, కసిరెడ్డి శరత్ రెడ్డి అనే కేటుగాళ్లు రెండేళ్ల క్రితం దాదాపు రూ.2.5 కోట్లు అక్రమంగా వసూలు చేసి వారికి ఎలాంటి రశీదులు ఇవ్వకుండా డబ్బునంతా తమ జల్సాలకు వాడుకున్నారు. కాగా, ఇటీవలే పొలిటికల్ బాండ్ల పేరుతో విరాళాలు పూర్తిగా చట్ట విరుద్ధమని ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. దీంతో అప్రమత్తమైన రిటైర్డ్ జడ్జీ తన డబ్బును తిరిగి ఇవ్వమని కేటుగాళ్లకు ప్రశ్నించగా.. వారు ఆ డబ్బును సదరు పార్టీకి చెల్లించకుండా తమ సొంతానికి వాడుకున్నట్లుగా తెలిసింది. ఇక చేసేదేమిలేక రిటైర్డ్ జడ్జీ నిందితులు నరేంద్ర, శరత్‌రెడ్డిపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement