Friday, May 3, 2024

AP : ప‌లు రైళ్లు ర‌ద్దు…స‌మ‌యాల్లో మార్పు…

ఏపీ ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు రైల్వేశాఖ పేర్కొంది. బ్రహ్మపుర-నౌపడ మార్గంలో లిమిటెడ్‌ హైట్‌ సబ్‌వే నిర్మాణ పనుల కారణంగా పలు రైళ్ల సమయాలను మార్పు చేసి, మ‌రికొన్ని రైళ్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

- Advertisement -

బ్రహ్మపుర-నౌపడ మార్గంలో లిమిటెడ్‌ హైట్‌ సబ్‌వే నిర్మాణ పనుల రీత్యా ఫిబ్రవరి 29న ట్రాఫిక్‌ బ్లాక్‌ చేయనున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగనున్నందున పలు రైళ్లు సమయాల్లో మార్పులు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఆ రైళ్లకు సంబంధించిన వివరాలను ఓసారి చూద్దాం. ఫిబ్రవరి 29న భువనేశ్వర్‌-చెన్నై సెంట్రల్‌(12830) ఎక్స్‌ప్రెస్ ట్రైన్ 5.25 గంటలు ఆలస్యంగా బయలు దేరనుంది.

వీటితోపాటు భువనేశ్వర్‌-సి.ఎస్‌.టి. ముంబై (11020), కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌, హౌరా-సికింద్రాబాద్‌(12703), విశాఖ-డిఘా(22874),విశాఖ-బ్రహ్మపుర(18526) రైళ్లు కూడా గంటకు పైగా ఆలస్యంగా బయలు దేరనున్నట్లు అధికారులు తెలిపారు.కామాఖ్య-బెంగళూరు(12552), సి.ఎస్‌.టి. ముంబై-భువనేశ్వర్‌(11019), విశాఖ-భువనేశ్వర్‌(22802) ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పలు స్టేషన్‌లలో 20 నిమిషాలకు పైగా నిలిపేయనున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని అధికారులు కోరారు.

పలు ట్రైన్లు రద్దు…
వీటితో పాటు పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో ఇంజినీరింగ్‌ పనులు జరుగుతున్నందున ఫిబ్రవరి 28 నుంచి మార్చి 11వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. విజయవాడ- గుంటూరు(07783), గుంటూరు- విజయవాడ(07788), గుంటూరు- మాచర్ల(07779), గుంటూరు- విజయవాడ(07465), గుంటూరు- రేపల్లె(07786) రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. వీటితో పాటు నర్సాపూర్‌- గుంటూరు-నర్సాపూర్‌(17282/17281) ట్రైన్లను కూడా విజయవాడ గుంటూరు మధ్య ఫిబ్రవరి 28 నుంచి మార్చి 11వరకు తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement