Wednesday, May 1, 2024

అక్ర‌మంగా తాబేళ్ల త‌ర‌లింపు.. నిందితులను ప‌ట్టుకున్న‌ అధికారులు

చింతూరు, (అల్లూరి) ప్రభన్యూస్‌: అక్రమంగా తరలిస్తున్న తాబేళ్ళను అటవీశాఖ అధికారులు పట్టుకున్న సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చింతూరు డీఎఫ్‌వో సాయిబాబా శుక్రవారం వెల్లడించారు. ఆయ‌న తెలిపిన‌ వివరాల ప్రకారం తులసిపాక అటవీ చెక్‌పోస్ట్‌ అటవీ సిబ్బంది.. తనిఖీలు నిర్వహిస్తుండుగా, రాజమండ్రి వైపు నుండి చింతూరు వైపు వస్తున్న ఏపీ 37 ఎక్స్‌ 8013 నెంబర్‌ గల టాటా గూడ్స్‌ వాహనాన్ని ఆపి తనిఖీలు నిర్వహించడంతో ఆ వాహనంలో లేస్‌ ప్యాకెట్లతో పాటు తాబేళ్ళు (ఇండియన్‌ సాప్ట్‌ సెల్లెడ్‌ తాబేళ్ళు) ఉన్నట్లు వారు గుర్తించినట్టు తెలిపారు డీఎఫ్‌వో సాయిబాబా.

ఆ వెహికిల్ లో మొత్తం 36 గోనే సంచులలో 648 తాబేళ్ళను అక్రమంగా తరలిస్తుండుగా తులసిపాక చెక్‌పోస్ట్‌ వద్ద పట్టుకున్నారు. తాబేళ్ళను తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుండి ఒడిశా రాష్ట్రానికి తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ తాబేళ్ళు వైల్డ్‌లైప్‌ యాక్ట్‌ 1972 చట్ట ప్రకారం షెడ్యూల్డ్‌ -1 భాగం ప్రకారం రవాణా చేయడం నేరమని పేర్కోన్నారు. పట్టుకున్న తాబేళ్ళతో సహా వాహనాన్ని లక్కవరం అటవీక్షేత్ర కార్యాలయానికి తరలించి సీజ్‌ చేయడం జరిగిందన్నారు. ఈ తాబేళ్ళ రవాణాకు పాల్పడిన శేఖర్‌ రాయ్‌ అనే వ్యక్తి పై కేసు నమోదు చేసి రంపచోడవరం కోర్టులో హాజరుపరిచారన్నారు పట్టుకున్న తాబేళ్ళను ఫోర్‌బై క్యాంప్‌ వద్ద ఉన్న జలాశయంలో విడిచిపెట్టినారు. ఈ తాబేళ్ళను పట్టుకున్న వారిలో లక్కవరం సెక్షన్‌ ఆఫీసర్‌ సోడె అరుణ కుమారి, బీటు అధికారులు క్రిష్ణ కుమారి, బసవయ్య, చెక్‌పోస్ట్‌ హెల్పర్లు తదితరులు పాల్గోన్నారు.\

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement