Friday, April 19, 2024

Followup: గ్యాస్‌ లీక్‌ ఘటనపై సీఎం ఆరా, విచారణకు ఆదేశాలు.. ఘటనాస్థలికి మంత్రి అమర్‌నాథ్‌

అమరావతి, ఆంధ్రప్రభ: విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురంలో అమ్మోనియా గ్యాస్‌ లీకేజీ ఘటనపై సత్వరమే విచారణ జరపాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గ్యాస్‌ లీక్‌ కారణంగా బ్రాండెక్స్‌లో పనిచేస్తున్న మహిళలు అస్వస్థత ఘటనపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనకు దారితీసిన కారణాలను సీఎంఓ అధికారులు వివరించారు. సంబంధిత జిల్లా కలెక్టర్‌ వెంటనే వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారని తెలిపారు.

 గ్యాస్‌ లీక్‌ను నియంత్రించారని చెప్పారు. బ్రాండిక్స్‌లో ఒక యూనిట్‌లో పనిచేస్తున్న మహిళలను అందర్నీ ఖాళీ చేయించామని, అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. లీకేజీ కారణంగా అనారోగ్యంపాలైన వారు కోలుకుంటు-న్నారని సురక్షితంగా ఉన్నారని వివరించారు. అమ్మోనియా ఎక్కడనుంచి లీ-కై-ందన్న అంశంపై అధికారులు దర్యాప్తు చేపట్టారన్నారు. అస్వస్థతకు గురైన వారికి మంచి వైద్యాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేసి, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని స్పష్టం చేశారు. సంఘటన స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించాల్సిందిగా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఆయన విజయవాడ నుంచి అనకాపల్లి బయల్దేరి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement