Monday, April 29, 2024

ఇంద్ర‌కీలాద్రిపై మళ్లీ విరిగిపడ్డ కొండ చరియలు..

ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో – ఇంద్రకీలాద్రి సమీపంలో మరోసారి కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో ఇంద్రకీలాద్రి కొండపై అప్పుడప్పుడు కొండ చరియలు విరిగి పడుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వర్షాకాలంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాల సమయంలో కొండ పై భాగాన రాళ్లు కిందకు పడుతూ ఉన్నాయి. వీటిని నిలువరించేందుకు దేవస్థాన అధికారులు కోట్లు ఖర్చు చేసి చర్యలు తీసుకుంటున్న ఫలితం ఇవ్వడం లేదు.

తాజాగా ఇంద్రకీలాద్రి దిగువన గోపురం సమీపంలో కొండ రాళ్లు విరిగిపడ్డాయి. కనకదుర్గ నగర్ సమీపంలో పెద్ద ఎత్తున కొండ చరియలు విరిగిపడడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. కొండ చరియలు విరిగిపడుతున్న సమయంలో అటుగా భక్తులు ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పినట్లు అయ్యింది. ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున బండరాళ్లు పడ్డాయి. దీంతో అధికారులు ముందస్తుగా అటువైపుగా రాకపోకలను నిలుపుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement