Saturday, May 4, 2024

రాజధాని పిటిషన్లపై నేడు హైకోర్టు విచారణ

పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ… దాఖలైన పలు పిటిషన్లపై సోమవారం ఏపీ హైకోర్టులో విచారణకు రానున్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్ గోస్వామి, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్‌ ఎస్.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై విచారణ జరపనుంది. వేసవి సెలవులకు ముందు వ్యాజ్యాలు త్రిసభ్య బెంచ్‌ ముందుకు రాగా ఏ పిటిషన్లను ఏ విధంగా విచారించాలో చర్చించారు. వేసవి సెలవుల తర్వాత విచారణ జరుపుతామని బెంచ్‌ నిర్ణయించింది. ఓసారి విచారణ ప్రారంభమయ్యాక వరుసగా విచారణ జరుపుతామని తెలిపింది.

కాగా, రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని, పాలన వికేంద్రీకరణ జరుపుతామని జగన్ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత హైకోర్టులో అమరావతి రైతులు, మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో హైకోర్టు సీజే గా ఉన్న జస్టిస్ జె.కె.మహేశ్వరి ఈ వ్యాజ్యాలను విచారించారు. తుది దశకు చేరుకునే సమయంలో అప్పటి ఆయన బదిలీ కావడంతో వ్యాజ్యాలను మళ్లీ విచారిస్తున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement