Wednesday, May 15, 2024

వెలవెలబోతున్న హంద్రీ కాల్వ.. ఆవేదన వ్యక్తం చేస్తున్నఅన్నదాతలు..

కర్నూలు, ప్రభన్యూస్ : జిల్లాలోని పత్తికొండ, కోడుమూరు, దేవనకొండ, క్రిష్ణగిరి, వెల్దుర్తి, నందికొట్కూరు, పాణ్యం మండలాల్లో దాదాపు 85వేల ఎకరాలకు హంద్రీనీవా ద్వారా నీరందుతున్నది. నిన్నటివరకు కళకళలాడిన పైర్లు ఒక్కసారిగా ఎండిపోతున్నాయి. మల్యాల నుండి మద్దికెర వరకు 140 కిలోమీటర్ల వరకు కాల్వకు ఇరువైపులా 25వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. అత్యధికంగా వేరుశనగ 15వేల ఎకరాల్లో సాగైంది. ఈ హంద్రీనీవా కాల్వ ద్వారా ప్రతి ఏటా ఏప్రిల్‌ వరకు నీటిని విడుదల చేసేవారు. ఈ ఏడాది ఫిబ్రవరి రెండవ వారంలోనే నిలిచిపోవడంతో పైర్లన్నీ ఎండిపోతున్నాయి. కర్షకులు ఆవేధన చెందుతున్నారు.

పందికోన జలాశయంలో ఉన్న నీరు కుడికాల్వ పరిధిలో ఉన్న పంటలకు వారం రోజులు మాత్రమే అందే అవకాశం ఉంది. హంద్రీనీవా ప్రధాన కాల్వకునీటిని నిలిపివేయడంతో నందికొట్కూరు నుండి మద్దికెర వరకు అన్నదాతలు కలత చెందుతున్నారు. రూ.లక్షల పెట్టుబడి పెట్టి 25వేల ఎకరాల్లో సాగుచేసిన రభీ పంటల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని అన్నదాతలు ఆవేధన చెందుతున్నారు. అధికారులు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా వేగంగా నీటిని నిలుపుదల చేయడంతో కళకళలాడిన పైర్లన్నీ ఎండి పోతుండటంతో సాగుచేసిన రైతుల కుటుంబాల్లో ఆవేధన నెలకొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement