Sunday, May 5, 2024

స‌ర్కారీ బీమా – భేషైన ధీమా…

న్యూఢిల్లీ/అమ‌రావతి – అత్యంత లాభదాయకమైన బీమారంగంలోకి కేంద్రం ప్రైవేటు పెట్టుబడుల్ని ప్రోత్సహిస్తోంది. తాజాగా ఈ రంగంలో నూరుశాతం విదేశీ పెట్టుబడు లకు ప్రభుత్వం తలుపులు తెరిచింది. ఒకప్పుడు దేశంలో బీమా రంగం మొత్తం ప్రభుత్వ అధీనం లోనే ఉండేది. ఎల్‌ఐసితో పాటు అనుబంధంగా ఐదు ప్రభుత్వరంగ సంస్థలు మొత్తం బీమా రంగాన్ని నిర్వహించేవి. ఇవన్నీ భారతీయ చట్టాల మేరకు ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారం నిర్వహించేవి. అయినప్పటికీ ఈ సంస్థల కు ఏటా వందలు, వేల కోట్లు ఆదాయం సమకూరేది. దేశం లోనే అత్యంత లాభదాయక రంగంగా ఇది రూపు దిద్దు కుంది. అంచెలంచెలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల క్కూడా ప్ర భుత్వ బీమా సంస్థలు వేలకోట్లు రుణాలుగా ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ దశలో ఈ రంగంపై ప్రైవేటు, కార్పొరేట్‌ దృష్టిప డింది. ప్రభుత్వ పెద్దలు కూడా అందుకనుగుణంగానే వ్యవహ రించారు. దీంతో ఈ రంగంలోకి ప్రైవేటు వ్యవస్థలు ప్రవె శించాయి. అనంతరం విదేశీ మదుపరులకు ఆహ్వానం పలి కారు. ఇప్పుడు నూరుశాతం విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం చేశారు. దేశవ్యాప్తంగా పలు సంక్షేమ పథకాల అమలుతో పాటు బీమాను కూడా కేంద్రం తప్పనిసరి చేసేసింది. వ్యవసాయ, ఆరోగ్య రంగాల్లో బీమా వ్యాపారం అనూహ్యంగా పెరిగింది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ బీమాను చెల్లించడం మొదలెట్టాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలే ఆరోగ్య బీమాను కూడా భరిస్తున్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ బీమా పథకం అమలౌతోంది. దీనిక్రింద తెల్లరేషన్‌ కార్డున్న 1.41కోట్ల కుటుంబాలున్నాయి. ఈ కుటుంబాల నిర్వహణకు ఆధారమైన వ్యక్తి ప్రమాదాల్లో మర ణించినా లేక పూర్తి అంగవైకల్యానికి గురైనా అతడు 18నుంచి 50ఏళ్ళ మధ్య వయస్కుడైతే 5లక్షలు, 51నుంచి 70ఏళ్ళ మధ్య వయసుంటే 3లక్షలు బీమా కంపెనీ చె ల్లిస్తుంది. అలాగే ఇంటిపెద్ద సహజమరణం పొందిన పక్షంలో అతని వయసు 50ఏళ్ళ లోపైతే 2లక్షలు, 70ఏళ్ళ లోపైతే లక్షన్నరను బీమా సంస్థలిస్తాయి. ఇందుకోసం ప్రభుత్వం ఏటా బీమా సంస్థలకు ప్రీమియం క్రింద 510కోట్లు చెల్లిస్తోంది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఇటువంటి బాధితులకు ఆర్ధిక సాయం చేయడం మొదలెట్టింది. వైఎస్‌ఆర్‌ బీమా పథకానికి చెల్లింపులు జరపలేదు. అందుకు బదులుగా ప్రభుత్వమే తన అధికార యంత్రాంగం ద్వారా మృతుల కుటుంబాలకు బీమా మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఇలా ఏడాది పొడవునా ప్రమాదాలు, లేదా సహజ మరణాల ద్వారా ఇంటిపెద్దను కోల్పోయిన కుటుంబాలకు రూ. 5లక్షలు లేదా రూ. 2లక్షల చొప్పున ఆర్ధిక సాయాన్ని అందించింది. ఇలా నేరుగా చేస్తే రూ. 230కోట్లు ఖర్చయ్యా యి. పైగా రాష్ట్రంలో ఎక్కడా ఎవర్నుంచి తమకు ఆర్ధిక సాయం అందలేదన్న ఆరోపణలు రాలేదు. ప్రభుత్వానికున్న వాలంటీర్‌ వ్యవస్థ నుంచి సచివాల యాలు, రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీ కార్యాలయాల సిబ్బంది, అధికారు ల ద్వారా మృతుల వివరాలన్నింటిని సక్రమంగా సేకరించి పరిశీలన అనంతరం ఈ నిధుల్ని ఆయా కుటుంబాలకు ప్రభుత్వం అందజేసింది. ఇందులో మధ్యవర్తుల పాత్ర ఏమాత్రం లేదు. ప్రభుత్వమిచ్చి న మొత్తం నేరుగా ఆయా కుటుంబాల బ్యాంక్‌ ఖాతాలకు జమై పోయింది. ఖాతాల్లేని కుటుంబాల పేరిట వలంటీర్లే ఖాతాల్ని తెరిపించారు. అదే బీమా సంస్థల ద్వారా చెల్లింపుల విషయం లో బాధిత కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవి. బీమా కంపెనీలు సక్రమంగా చెల్లింపులు జరిపేవి కాదు. ఇందుకోసం బాధితులు అధికారులను, కొన్ని సంద ర్భాల్లో న్యాయవా దుల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితుం డేది. లేదా కంపెనీలకు చెందిన ఏజెంట్లు మధ్యవ ర్తులుగా వ్యవహరించి కొంత ప్రయోజనాన్ని పక్కకు తప్పించేవారు. అయినప్పటికీ బీమా కంపెనీలు నూరు శాతానికి పైగా లాభం పొందుతున్న వైనం తాజా లెక్కల్తో తేటతెల్లమౌతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని తెల్లరేష న్‌ కార్డున్న కుటుంబాలన్నింటిని సామాజిక బీమా ప్రయోజ నం పరిధిలోకి తెస్తే ఏటా ప్రభుత్వం 510 కోట్లు ప్రీమియంగా చెల్లించేది. అదే కుటుంబాల్లోని బాధితులకు ప్రభుత్వం నేరుగా చెల్లిస్తే 230 కోట్లే సరిపోయా యి. ఈ ఒక్క పథకంలోనే బీమా కంపెనీలు ఏటా 280 కోట్లు లాభాల్ని పొందుతున్నాయి. ఇవికాక ఆరోగ్య బీమా, వ్యవసా య బీమా, వాహనాల బీమా, పరికరాల బీమా ఇలా వివిధ మార్గా ల్లో ఈ బీమా సంస్థలు ఏటా వేలకోట్లు ఆర్జిస్తున్నాయి. స్టార్‌ హెల్త్‌ కేర్‌, ప్రుడెన్షియల్‌, బజాజ్‌, ఐసిఐసిఐ, శ్రీరామ్‌ తదితర బీమా కంపెనీలు ఈ రంగంలో దూసుకుపో తున్నాయి. మరోవైపు కేంద్రం రోజు రోజుకు బీమాపై ఒత్తిడి పెంచుతోంది. రవాణా వాహనాలకు థర్ట్‌ పార్టీ బీమాను తప్ప నిసరి చేసింది. అలాగే కొన్ని సంస్థల వద్దే బీమా చేయించాలంటూ రాష్ట్రాలపై ఒత్తిళ్ళు తెస్తోంది.
సాధారణ సందర్భాల్లో బీమా సంస్థలు సకాలంలో బాధితులకు పరిహారాన్ని చెల్లించిన దాఖలాలుం డవు. ఆఖరకు జీవిత బీమా విషయంలో కూడా లబ్ధిదార్లకు ప్రయోజనాలందించడంలో పలు సమస్య ల్ని సృష్టిస్తాయి. ప్రమాద మరణాల సందర్భంలోనూ సవాలక్ష ఆంక్షలెడతా యి. మధ్యవర్తులు లేదా న్యాయవాదుల చుట్టూ బాధిత కుటుంబీకులు తిర గక తప్పదు. చివరకు న్యాయవాదుల్తో నిర్ణీత శాతాన్ని మాట్లాడుకోవాల్సిన పరిస్థితేర్పడుతుంది. అదికూడా నాలుగైదేళ్ళ అనంతరమే కోర్టు తీర్పుకనుగు ణంగా చెల్లింపులు జరుపుతారు. ఈలోగా బాధిత కుటుం బాలు అనేక ఇబ్బందులకు గురౌతాయి. మరణాలు, ఇతర కష్టనష్టాల సమయంలో ఆర్ధికంగా అండదండలందిస్తారన్న ఆకాంక్షతోనే ఎవరైనా బీమా ప్రీమియం చెల్లిస్తారు. తమకు తాము బీమా పరిధిలోకి తెచ్చుకుంటారు. కానీ ప్రస్తుత ప్రైవేటు, కార్పొరేట్‌ బీమా సంస్థలేవీ సక్రమంగా చెల్లింపులు జరపవు. ఈ విషయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు. అయినప్పటికీ ప్రైవేటు బీమా సంస్థలకు వందలు, వేల కోట్లు ఇచ్చి ప్రోత్సహిస్తాయి. వీటితో పాటు తాజాగా నూరుశాతం విదేశీ పెట్టుబడులకు కూడా ఆస్కారం కల్పిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బీమా సంస్థ ఏర్పాటుకు లైసెన్స్‌ సంపాదిస్తే చాలు.. వేల కోట్లు లాభాలు పొందినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement