Saturday, April 27, 2024

గ్రామీణ ప్రజలకు సేవలు అందిస్తున్న తపాల శాఖ

పొన్నూరు ఫిబ్రవరి 19 ప్రభ న్యూస్ – గ్రామీణ ప్రజలకు భారత ప్రభుత్వ తపాలా శాఖ జీవిత బీమా తో పాటు సంక్షేమ పథకాలు అందిస్తోంది. భీమా సంరక్షణ రూ పదివేల నుండి రూ పది లక్షల వరకు సౌకరం కల్పించింది. సురక్ష, సువిధ, సుమంగల్ ,సంతోష్, గ్రామ ప్రియ ,చిల్డ్రన్ పాలసీ ఉంటే పథకాలను అమలు చేస్తుంది. తపాలా జీవిత బీమా సంరక్షణ సుఖసంతోషాల కురిపిస్తుంది. ఏ పోస్ట్ ఆఫీస్ లోనైనా ప్రీమియం చెల్లించే సదుపాయం కల్పించారు. ఆదాయ పన్ను రాయితీ, నామినేషన్, సౌకర్యం రుణ సౌకర్యం కల్పించారు. వయోపరిమితి 19 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు ఉంది. దీనికి గ్రామీణ ప్రాంత ప్రజలు అర్హులు. పూర్తి వివరాలకు సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ను సంప్రదించాలి. తపాల శాఖ పోస్ట్ ఆఫీస్ ద్వారా సేవింగ్స్ , రికరింగ్ డిపాజిట్ మంత్లీ ఇన్కమ్ స్కీము, నేషన్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, కిసాన్ వికాస్, పత్ర పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజెన్సీ, ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ వంటి సదుపాయాలను గ్రామీణ తపాలా జీవిత భీమా విదేశాల నుంచి అందజేస్తుంది.


నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు ఆమోదించిన రూపే ఏటీఎం కార్డులను ఎటువంటి విషయం లేకుండా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాదారులు పొందవచ్చు. ఈ రూపే కార్డులు అన్ని ఏటీఎంలో పనిచేస్తాయి. రూపే ఏటీఎం కార్డు వాడటానికి ఎటువంటి పరిమితులు కానీ రుసుముఖాన్ని లేవు. పోస్ట్ ఆఫీస్ లో కేవలం 50 రూపాయలతో సేవింగ్స్ గత ప్రారంభించవచ్చు. అంతేకాకుండా కేవలం 12 రూపాయల సంవత్సర ప్రయాణంతో రెండు లక్షల రూపాయల ప్రమాద బీమాను ప్రధానమంత్రి సురక్ష బీమా కింద పొందవచ్చు. తపాలా కార్యాలయంలో ఆన్లైన్ విధానం ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చు. కేవలం మూడు పాస్పోర్ట్ సైజులు, ఆధార్ నకుల పత్రంతో పోస్ట్ ఆఫీస్ లో తగిన సొమ్ముతో ఖాతా తెరవచ్చు. తపాలా శాఖలు ఎంత పదమునైనా జమ చేసుకోవచ్చు. పరిమితి లేదు అదనపు రుసుములు ఏమీ ఉండవు .ఖాతాల్లో జరిగే తాజా లావాదేవీలు వివరాలను ఖాతాదారుల మొబైల్ ఫోన్కు ఎస్ఎంఎస్ రూపంలో తెలియజేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement