Sunday, April 28, 2024

వ్యాపార వేళల కుదింపుపై ముస్లింలీగ్ అభ్యంతరం

కర్ఫ్యూ వేళలను సవరించాలి
రాష్ట్ర అధ్యక్షుడు బషీర్ అహమ్మద్ డిమాండ్

గుంటూరు నగరంలో వ్యాపారవేళల కుదించటం పట్ల ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్రఅధ్యక్షుడు బషీర్ అహమ్మద్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యాపారం చేసుకునే సమయాన్ని కుదించడం వల్ల ఆ కొద్ది సమయంలోనే కొనుగోలుదారులు అందరూ రావడం జరుగుతుందని దానివల్ల రద్దీ పెరిగి కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని కాబట్టి వ్యాపార సమయాలను యధావిధిగా కొనసాగించాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ డిమాండ్ చేసింది. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను పెడితే, గుంటూరు లో రాత్రి 7గంటల నుంచే మరునాటి ఉదయం 5 వరకు కర్ఫ్యూ పెట్టాలనే ఆలోచన హాస్యాస్పదమని ఆయనన్నారు. గుంటూరు నగరంలోనూ హైదరాబాదులో మాదిరిగానే కర్ఫ్యూ విధించాలని ఆయన కోరారు. అనాలోచితంగా వ్యాపార సమయాలను కుదించడం, సాయంత్రం 7 నుంచి మరునాటి ఉదయం ఐదు ఇంటిదాకా కర్ఫ్యూ ని పెట్టడం లాంటి చర్యల వల్ల సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లు ఆర్థికంగా చితికి పోతారని, సందిట్లో సడేమియా లాగా బ్లాక్ మార్కెటింగ్ పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో వుంచుకొని వెంటనే సాయంత్రం ఆరింటికి నుంచి మరునాటి పొద్దున ఐదింటికి కర్ఫ్యూ అనే నిర్ణయాన్ని మార్చుకుని రాత్రి 10 నుంచి మరునాటి ఉదయం నాలుగు గంటల దాకా కర్ఫ్యూ వేళలు మార్చాలని ఆయన సూచించారు. కరోనా అదుపులోకి రావాలంటే కర్ఫ్యూ ఒక్కటే మార్గం కాదని, మాస్క్ లను వాడటం, భౌతిక దూరాన్ని పాటించడం, నగరపాలక సంస్థ తన సొంత నిధులతో ప్రతి టీకాలు వేయించాలి అని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement