Thursday, March 28, 2024

‘అఖండ’ కు అడ్డే లేదు !!

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అఖండ. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ చిత్రాలు ఘనవిజయం సాధించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ సినిమా పై అంచనాలను మరింత రెట్టింపు చేసింది. అంతే కాకుండా ఈ టీజర్ సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్ లో దుమ్ము దులుపుతుంది.

ఈ టీజర్ లేటెస్ట్ గా 30 మిలియన్ల వ్యూస్ ను సంపాదించింది. బాలకృష్ణ కెరీర్ లోని ఇదే హైయెస్ట్ కావడం విశేషం. దక్షిణాదిలో సీనియర్ హీరోస్ లో అత్యధిక వ్యూస్ ను సాధించిన కబాలి, కాలా టీజర్ తర్వాత 30 మిలియన్ల వ్యూస్ సాధించిన హీరోగా బాలయ్య మాత్రమే ఉన్నాడు. దీనిని బట్టే అఖండ ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. పూర్ణ, జగపతిబాబు, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement