Wednesday, May 1, 2024

ఘనంగా మహా శివరాత్రి ఉత్సవాలు

తాడికొండ, ఫిబ్రవరి18(ప్రభ న్యూస్) మండల కేంద్రమైన తాడికొండలోని తాడికొండ భవాని పీఠం వారి తాడికొండ శివారు బడే పురం కొండ దిగువన గల భవాని క్షేత్రం నందు మహా శివరాత్రిని పురస్కరించుకొని త్రయాన్నిక విశేష ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు శనివారం విగ్నేశ్వర పూజ,పుణ్యాహ వచన, రక్ష బంధనం, భవాని శంకరుని అభిషేకం,నవ గ్రహార్చన గణపతి,రుద్ర హోమాలు,లింగోద్భవ అభిషేకం, శాంతి కల్యాణం జరిగాయి.ఈ కార్యక్రమంలో భవాని పీఠ వ్యవస్థాపకులు శర్మ దంపతులు,కార్యదర్శి శర్వాణి, పీఠ సభ్యులు స్వామి,తిరుపతి నాయుడు, బ్రహ్మయ్య,శ్రీను,అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.చివరిగా తీర్ధప్రసాద వినియోగం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement