Friday, May 3, 2024

సమన్వయంతో కలిసి పనిచేయాలి :మేకతోటి సుచరిత

కాకుమాను,ఫిబ్రవరి 23(ప్రభ న్యూస్ ):మండల కేంద్రం అయిన కాకుమాను గ్రామ రూరల్ గోడౌన్స్ నందు గురువారం
గ్రామ సచివాలయ వాలంటీర్లు, కన్వీనర్లు, గృహ సారధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధిగా ప్రత్తిపాడు శాసనసభ్యురాలు,మాజీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి అందిస్తున్న సంక్షేమ పథకాలను సక్రమంగా ప్రజలకు అందిస్తున్న ఘనత వాలంటీర్లు కె దక్కుతుందని అన్నారు. కరోనా సమయంలో కూడా ప్రజలు భయ భ్రాంతులుకు గురి అయిన రోజులలో, ప్రతి ఇంటి వెళ్ళి సంక్షేమ పథకాలను అందించి ప్రజలకు సంక్షేమ పధకాలను సక్రమంగా అందిస్తున్నారని అన్నారు . ప్రస్తుతం వాలంటీర్లుకు అనుసంధానంగా ఇద్దరు గృహ సారధులను
నియమించుట జరిగినదని తెలిపారు. వాలంటీర్లు గృహ సారదులతో మమేకమై స్థానిక నేతలతో కలిసి క్షేత్రస్థాయిలో
పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకొని ప్రతి గృహంను సందర్శించాలాన్నారు. ప్రభుత్వం ప్రజలకు చేసే
మంచి పనిని గురించి వివరించాలని తెలిపారు.గత ప్రభుత్వం వారు ఏమిచేసారు,వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచి
పనులు గురించి తెలియజేయాలి అని సూచించారు.


సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లు అర్హత ఉన్న ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందే విధంగా చూసే బాధ్యత వాలంటీర్లు మరియు గృహ సారదులదే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామినేని. శ్రీనివాసరావు,జడ్.పి.టి.సి.సభ్యులు ముజావర్ షేక్ గుల్జర్ బేగం ,నల్లమోతు. శివరామకృష్ణ,సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు రాఘవరెడ్డి, పున్నారావు, రవి, ఉప ఎంపీపీ లు కపిల్, వెంకటరెడ్డి ఎం.పి.టి.సి.సభ్యులు, సర్పంచ్ లు, కో-ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు మరియు గృహ సారధులు, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement