Thursday, April 25, 2024

ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్మిక కర్షక ర్యాలీని జయప్రదం చేయండి

తాడేపల్లి,ఫిబ్రవరి23(ప్రభ న్యూస్) ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్మిక కర్షక ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతూ గురువారం
వడ్డేశ్వరం ప్రజాసంఘాల కార్యాలయంలో రైతు సంఘం కౌలు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వై.కేశవరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్ రంగానికి అప్పజెప్పేందుకు మూడు నల్ల చట్టాలను తెచ్చిందని ఈ చట్టాల రద్దుకై సంవత్సరం పైగా ఢిల్లీ సరిహద్దుల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేసి చారిత్రాత్మకమైన ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వము లొంగి నల్ల చట్టాలను రద్దు చేసిందని అన్నారు. రైతులకు ఇచ్చిన మద్దతుల చట్టం విద్యుత్ సంస్కరణల చట్టం తదితర వాగ్దానాలను తుంగలో తొక్కి దొడ్డి దారిన మరల ఈ చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని కావున రైతులందరూ కదలి ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి కోరారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు రద్దు చేయాలని కేరళ తరహా రుణ విమోచన చట్టం తేవాలని రైతాంగం అప్పులు రద్దు చేయాలని అన్ని పంటలకు బీమా సౌకర్యం కల్పించాలని గ్రామీణ ఉపాధి హామీ నిధులు పెంచాలని నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని కనీస వేతనం 26000 ఇవ్వాలని రాష్ట్ర విభజన హామీలు అమలు జరపాలని తదితర డిమాండ్స్ తో ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు.
ఈ సమావేశంలో సిఐటియు నాయకులు వి.దుర్గారావు, కే.కరుణాకర్ రైతు సంఘం నాయకులు ఎం.శ్రీనివాసరెడ్డి డి.వెంకట్ రెడ్డి, బి.శివారెడ్డి, బి.గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement