Monday, December 9, 2024

ఎపి ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఈ – బైక్ లు..

అమరావతి, : రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకాన్ని, ఈ-రవాణాను ప్రోత్సహించే లక్ష్యం తో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలను ఈఎంఐల విధానంలో అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొం దించిందని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ తెలిపారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్టీపీసీ, ఈఈఎస్‌ఎల్‌, ఇతర సంస్థలతో కలిసి నిధులు సమకూర్చుకోనున్నట్టు- తెలిపారు. స్వచ్ఛందంగా ఎలక్ట్రిక్ర్‌ వాహనాల కోసం దరఖాస్తు చేసుకునే ప్రభుత్య ఉద్యోగలందరికీ ఈఎంఐ పద్ధతిలో వాహనాలను అందజేయనున్నట్టు- వెల్లడించారు. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 40 నుంచి 100 కిలోమీటర్లు తిరిగే ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటు-లో ఉన్నాయని, ఈఎంఐ కూడా రూ 2 నుంచి రూ 2500 ఉంటు-ందని, ఈఎంఐ గడువు 24 నుంచి 60 నెలలు ఉంటు-ందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు- సహకార సంఘాలు, ప్రభుత్వరంగ సంస్థలు, పెన్షన్‌దారులు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి కూడా ఈ స్కీంను వర్తింపచేస్తామని ఈ మేరకు త్వరలోనే ప్రభుత్వం జీవో విడుదల చేస్తుందని వెల్లడించారు. ఈ-రవాణాలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా మార్చటమే లక్ష్యంగా ఎలక్ట్రిక్ర్‌ మొబెలిటీ- పాలసీ 2018-23ని ప్రవేశపెట్టినట్లు- నాగులాపల్లి తెలిపారు. ఎలక్టిక్‌ వాహనాల (ఈవీ) వినియోగంపై ఇంధనశాఖతో పాటు- నెడ్‌క్యాప్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ-రవాణా వల్ల వాతావరణ మార్పులు, భూతాపం వంటి సమస్యలు తగ్గడంతో పాటు- పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ప్లగ్‌ అండ్‌ ప్లే, తదితర సకల సౌకర్యాలతో ఈవీ పార్కులను అభివృద్ధి చేసేందుకు 500 నుంచి 1000 ఎకరాల భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలిపారు. ప్రైవేటు- చార్జింగ్‌ స్టేషన్లు, హైడ్రోజన్‌ ఉత్పత్తి, రీ ఫ్యూయలింగ్‌ సదుపాయాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందచేయనున్నట్టు- తెలిపారు.
ప్రత్యేక టారిఫ్‌
ఈవీల కోసం ప్రత్యేకంగా సబ్‌ కేటగిరీని సృష్టించి యూనిట్‌ కు రూ.6.70గా టారిఫ్‌ను ఖరారు చేసినట్టు- వెల్లడించారు.ఎలక్ట్రిక్ర్‌ వాహనాల కోసం ఈఈఎస్‌ఎల్‌ ఇప్పటికే 80 ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు- చేయటంతో పాటు- వివిధ ప్రభుత్వ విభాగాలకు 300 ఈ-కార్లు కూడా అందజేసిందన్నారు. రాష్ట్రంలోని 73 ప్రాంతాల్లో 400 ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు- చేయాలని నిర్ణయించినట్లు- తెలిపారు. ఐసీఈ(పర్యావరణ రహిత వాహనాలు) వాహనాల నుంచి ఈవీలకు మారే అంశం సజావుగా సాగేందుకు కృషి చేస్తున్నామని, రాష్ట్రంలోని నాలుగు ప్రధాన నగరాల్లో 2024 కల్లా వాణిజ్య, లాజిస్టిక్‌ వాహనాలన్నింటినీ దశలవారీగా తొలగించి ఈవీలుగా మారుసామని, 2030కల్లా అన్ని నగరాల్లో తొలగించేలా ఈవీ విధానాన్ని రూపొందించినట్టు- తెలిపారు.ఈ సమావేశంలో పాల్గొన్న నెడ్‌ క్యాప్‌ ఎం.డి ఎస్‌.రమణారెడ్డి మాట్లాడుతూ, ఇంటర్నల్‌ కంబస్టన్‌ ఇంజిన్‌ (ఐసీఈ) వాహనాల కంటే ఈవీలు అత్యుత్తమమైనవని తెలిపారు. జీహెచ్జీ ఉద్గారాలు తగ్గడంతో పాటు- గాలి నాణ్యత పెరుగుతుందన్నారు..ఈ-రవాణాపై అవగాహన పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వర్క్‌ షాపులు, వెబినార్లు, రోడ్‌ షోలు, ఓఈఎంలతో సమావేశాలను నిర్వహించనున్నట్టు- తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement