Wednesday, May 1, 2024

చిర్రావూరు జడ్పీ హైస్కూల్ లో కెఎల్ యు విద్యార్ధుల కెరీర్ గైడెన్స్…

తాడేపల్లి,ఫిబ్రవరి20(ప్రభ న్యూస్) – స్థానిక కెఎల్ విశ్వవిద్యాలయం విద్యార్ధులు సెంటర్ ఫర్ ఎక్స్ టెన్షన్ యాక్టివిటీ ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ కార్యక్రమం చిర్రావూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థి విభాగ అధిపతి డాక్టర్ సిహెచ్ హనుమంతరావు మాట్లాడుతూవిద్యార్థులు తమ భవిష్యత్తును బాగుండేలా చక్కగా చదువుకోవాలని సూచించారు. అసోసియేట్ డీన్ డాక్టర్ రూత్ రమ్య మాట్లాడుతూ జీవితంలో ఉన్న శిఖరాలు అధిరోహించాలంటే పదో తరగతి తర్వాత ఎటువంటి కోర్సులు తీసుకుంటే ఎలాంటి ఉద్యోగాల్లో సెటిల్ అవుతారు అనే అంశాలను వివరించారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి కోర్సులు చదువుకునేటట్లు చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సిఈఎ వారిని వైస్ చాన్సులర్ డాక్టర్ పార్థసారథి వర్మ, ప్రో” వైస్ ఛాన్సులర్ డాక్టర్ వెంకట్రామ్, రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ లు అభినందించారు. ఈ కార్యక్రమంలో సిఈఎ ప్రో ఇంచార్జి డాక్టర్. గోపికృష్ణ , కో-ఆర్డినేటర్ డాక్టర్ వెంకటేశ్వర్లు సమన్వయకర్తగా వ్యవహరించారు. సి.ఈ.ఏ. వాలంటీర్లు, విద్యార్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement