Sunday, May 5, 2024

ప్ర‌యాణీకుల‌కు మాస్క్ లు అందివ్వండిః సిబ్బందికి ఆర్టీసీ ఎండి ఆదేశం…

అమరావతి, : కరోనా విజృంభిస్తున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల అవసరాల మేరకు అవసరమైన మార్గాలలో ఆపరేషన్స్‌ పెంచడం, అనవసరమైన ట్రిప్పులు తగ్గించడం, బస్సుల సంఖ్యను కుదించడం వంటి చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీసీ వీసీ అండ్‌ ఎండీ ఆర్పీ ఠాకూర్‌ స్పష్టం చేశారు. సిబ్బంది వాక్సినేషన్‌, ప్రయాణికులకు జాగ్రత్తలు, రి-టైర్డ్‌ సిబ్బంది అరియర్స్‌ తదితర అంశాలపై గురువారం విజయవాడ ఆర్టీసీ హౌస్‌ నుంచి ఆయన వర్చ్యువల్‌ సమావేశం నిర్వహించారు. ఏవైనా బస్సులు రద్దు చేసినా, రెండు బస్సులు మెర్జ్‌ చేసినా తప్పనిసరిగా ఆ సమాచారాన్ని ప్రయాణికులకు ఫోన్‌ చేసి చెప్పాలని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులకు సూచించారు. ఇంటర్‌ స్టేట్‌ బస్సు ఆపరేషన్లకు సంబంధించి తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, ఒడిశా రాష్ట్రాల నిబంధనలకు అనుగుణంగా బస్సులు నడపాల్సి ఉంటు-ందన్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా అన్ని బస్టాండ్లు, కార్యాలయాలను సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో శానిటేషన్‌ చేయించాలని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం, శాని-టైజర్‌ వినియోగించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేయాలని రీజినల్‌ మేనేజర్లకు, డిపో మేనేజర్లకు, వివిధ విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందుకోసం అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నామన్నారు. సంస్థలో 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క ఉద్యోగికి వాక్సినేషన్‌ వేయించాలని ఠాకూర్‌ సూచించారు. డ్రైవర్‌లు, కండక్టర్‌లు, ట్రాఫిక్‌ సిబ్బంది, అవుట్‌ సోర్సింగ్‌, ఇతర సిబ్బంది అందరికీ డబుల్‌ లేయర్‌ మాస్కులు సరఫరా చేయాలని సూచించారు. బస్సులలో మాస్కలు లేకుండా ప్రయాణించే వారికి తక్షణం సరఫరా చేయాలన్నారు. కోవిడ్‌ బారిన పడిన ప్రభుత్వోద్యోగులకు ఇస్తున్న విధంగానే సంస్థ ఉద్యోగులకు 14 రోజుల స్పెషల్‌ క్యాజువల్‌ సెలవు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. హెల్త్‌ కార్డుల మంజూరు విషయం లో ప్రభుత్వాన్ని సంప్రదించి త్వరగా అందేలా చూడాలని చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ అప్పారావును ఆదేశించారు. ఈ నెల 27, 30 తేదీలలో రి-టైర్డ్‌ సిబ్బందికి రూ. 84 కోట్లు- చెల్లించా లని స్పష్టం చేశారు. టికేట్టేతర ఆదాయంలో భాగంగా వాణిజ్య రాబడిని పెంపొందిం చందుకు ఖాళీ స్థలాల్లో పెట్రోల్‌ బ్యాంకుల నిర్మాణం, బీవోటీ ప్రాతి పదికన కేటాయింపు లీజు, అద్దె ప్రాతిపదికన కేటాయించే చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. బస్‌ స్టేషన్లలో ఖాళీగా ఉన్న స్థలాలు, షాపులను త్వరితగతిన కేటాయించి వాణిజ్య రాబడి పెంచాలన్నారు. సమావేశంలో ఈడీ పి. కృష్ణ మోహన్‌, సీఎఎం సుధాకర్‌, సీటీఎం చంద్ర శేఖర్‌, సీపీఎం డి. సామ్రాజ్యం, డీవైసీటీఎం ఉషారాణి, సీవోఎస్‌(ఐటీ) శ్రీనివాస్‌, జోన్ల ఈడీలు, ఆర్‌ఎంలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement