Sunday, May 5, 2024

Great Honor – ఆంధ్ర‌ప్ర‌భ ఛైర్మ‌న్ ముత్తా గోపాలకృష్ణకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అరుదైన గౌర‌వం …

కాకినాడ – సామాజిక దార్శనికులు, రాజకీయ వేత్త.. పారిశ్రామిక వేత్త, ఆంధ్రప్రభ యోగి..కాకినాడ ప్రజల పెద్దాయనకు అనూహ్యరీతిలో అరుదైన గౌరవం లభించింది. రాజకీయాలకు అతీతంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కాకినాడసిటీ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చొరవతో కాకినాడ నగరంలోని అతిపెద్ద వంతెనకు ముత్తా గోపాలకృష్ణ వారధి అని నామకరణం చేశారు.

ఆంధ్రప్రభ చైర్మన్ ముత్తా గోపాల కృష్ణ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేకున్నా . వైఎస్ జగన్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. –నాలుగు దపాలుగా శాసన సభ్యుడిగా పనిచేసిన ముత్తా గోపాలకృష్ణ కాకినాడ అభివృద్ధి కోసం తపించారు. పౌరసరఫరాల శాఖా మంత్రిగా ఆంధ్రులకు మరింత దగ్గరయ్యారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆధీనంలోని ఆంధ్రప్రభ దినపత్రిక అవసానదశను గుర్తించి, జాతీయోద్యమంలో అక్షర యుద్ధం చేసిన ఆంధ్రప్రభపై మక్కువతో.. ఈ పత్రికను కాపాడే బాధ్యతను భుజాన వేసుకున్నారు. వ్యయప్రయాసలు, కష్టనష్టాలనోర్చి ఈ రోజున జాతీయ స్థాయిలోనే తిరుగులేని పత్రికగా మలిచారు. ఈయన శ్రమైక్య జీవనాన్ని గౌరవించేందుకు సీఎం జగన్ ప్రభుత్వం కాకినాడ సిటీలో నిర్మించిన అతి పెద్ద బ్రిడ్జి్కి ముత్తా గోపాలకృష్ణ పేరు పెట్టటం కాకినాడ వాసులకే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు లభించిన అరుదైన గౌరవం, గర్వకారణం అని ముత్తా గోపాలకృష్ణ అభిమానులు భావిస్తున్నారు. కాగా ఈ వంతెన‌ను రేపు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కాకినాడ ప్ర‌జ‌ల‌కు అంకితం ఇవ్వ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement