Monday, May 6, 2024

Great Escape – ఎర్రచందనం స్మగ్లింగ్ లో జబర్దస్త్ కమెడియన్ హరి బిజిబిజీ….

పుంగ‌నూరు – జబర్దస్త్ కమెడియన్ హరి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ దొరికిన‌ట్లే దొరికి త‌ప్పించుకుపోయాడు .. వివ‌రాల‌లోకి వెళితే చిత్తూరు జిల్లా పుంగనూరులో అటవీశాఖ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.60 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమ‌యంలో నిందితుడు హరి మాత్రం స్పాట్‌లోనే ఉన్నాడు..పోలీసులు త‌నిఖీలు చేస్తుండటంతో వారి క‌ళ్లు గ‌ప్పి పారిపోయాడు. దీంతో హరి కోసం గాలిస్తున్నారు.

గతంలోనూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఆయన పోలీసులకు పట్టుబడ్డారు. ఇప్పటికే హరిపై పలు సెక్షన కింద కేసులు నమోదు అయ్యాయి. కాగా జబర్దస్త్ షోలో లేడీ గెటప్స్ ద్వారా హరి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గ‌తంలో ఎర్రచందనం స్మగ్లింగ్ లో అత‌డిపై ప‌లు కేసులు న‌మోద‌య్యాయి.. జైలుకి వెళ్లిన ప్ర‌తిసారి బెయిల్ పై బ‌య‌ట‌కు రావ‌డం తిరిగి స్మగ్లింగ్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నాడ‌ని పోలీసులు తెలిపారు.. అలాగే హరికి త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌కు చెందిన‌ స్మగ్లర్లతో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్క‌డ అడ‌వుల‌లో ఎర్ర‌చంద‌నం చెట్ల‌ను నరికి ఇత‌ర రాష్ట్రాల‌కు అక్ర‌మంగా ర‌వాణ చేస్తున్నాడు హ‌రి..

Advertisement

తాజా వార్తలు

Advertisement