Monday, April 29, 2024

Ap : డాక్టర్ సంప్రదింపుల పరంగా వృద్ధి నమోదు చేసిన హెల్త్ ప్లిక్స్

ఆంధ్రప్రదేశ్ : భారతదేశంలోని అతిపెద్ద EMR ప్లాట్‌ఫారమ్ అయిన హెల్త్‌ప్లిక్స్ టెక్నాలజీస్, డాక్టర్లచే విశ్వసించబడుతోంది, H1 2023 (జనవరి 23 నుండి నేటి వరకు) లో ఆంధ్రప్రదేశ్‌లోని తమ ప్లాట్‌ఫారమ్‌లో డాక్టర్ సంప్రదింపులు పెరిగాయని ఈ రోజు ప్రకటించింది. సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లో సుమారుగా 3.5 లక్షల సంప్రదింపులు ఈ వేదిక పై నమోదయ్యాయి. ఈసందర్భంగా హెల్త్‌ప్లిక్స్ టెక్నాలజీస్‌లో డాక్టర్ గ్రోత్ & రిటెన్షన్ హెడ్ తేజస్వి సింగ్ ఈ వృద్ధి గురించి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిజిటల్ హెల్త్‌కేర్ సేవలకు ప్రసిద్ధి చెందిందన్నారు. భారతదేశం అతిపెద్ద ఈఎంఆర్ ప్లాట్‌ఫారమ్‌గా తాము డిజిటల్ హెల్త్ రికార్డులలో వృద్ధిని పెంచామన్నారు. దేశంలో, జనాభా స్థాయిలో నాణ్యమైన ఆరోగ్య ఫలితాలను అందించడంలో డిజిటల్ సహాయకులుగా డాక్టర్ లు మమ్మల్ని విశ్వసిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని డాక్టర్ లు హెల్త్‌ప్లిక్స్ వంటి డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫారమ్‌లను వేగంగా స్వీకరిస్తున్నారని ఈ పోకడలు చూపిస్తున్నాయన్నారు. ఇంకా తాము రాష్ట్ర డిజిటల్ హెల్త్ కార్యకలాపాలతో జతకట్టడం సంతోషంగా ఉందన్నారు.

హెల్త్‌ప్లిక్స్‌ని ఉపయోగించటంలో తన అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరికి చెందిన ప్రఖ్యాత మధుమేహ నిపుణుడు డాక్టర్ నేలకుదిటి లక్ష్మణ కుమార్ వెల్లడిస్తూ… హెల్త్‌ప్లిక్స్‌ తన ప్రాక్టీస్ పరంగా విప్లవాత్మక మార్పులు చేసిందన్నారు. ఈఎంఆర్ గురించి తన దృక్పథాన్ని మార్చిందని, కొత్త అవకాశాలకు తలుపులు తెరిచిందన్నారు. దీని వైవిధ్యమైన మాడ్యూల్స్ మందుల ప్రిస్క్రిప్షన్ వంటి పనులను క్రమబద్ధీకరిస్తాయన్నారు. వినియోగం ట్రాకింగ్ చేయటంతో పాటుగా సమయానుకూలమైన రిమైండర్‌లను సైతం అందిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement