Saturday, May 4, 2024

Good News – రైలు ప్ర‌యాణీకుల‌కు గుడ్ న్యూస్… టిక్కెట్ క్యాన్సిల్ చేసుకుంటూ ఫుల్ రీఫండ్

ముంబై – పేటీఎం తమ యూజర్లకు బంఫర్ ప్రకటించింది. ముఖ్యంగా తత్కాల్ సేవలో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి ఇకపై రీఫండ్స్ విషయంలో గుడ్ న్యూస్ అందించింది. పేటీఎం యాప్ నుంచి రైలు టిక్కెట్లను బుకింగ్‌ చేసుకునే సమయంలో.. అదనంగా కేవలం రూ.15 ప్రీమియం చెల్లిస్తే చాలు. ఒకవేళ సదరు టిక్కెట్లను రద్దు చేసుకోవాల్సి వస్తే.. భారీగా డబ్బులు ఖర్చు అవుతాయనే టెన్షన్ నుంచి రిలీఫ్ పొందవచ్చని తెలిపింది. అంటే, ఫుల్ అమౌంట్ రిఫండ్‌ను పొందొచ్చని పేటీఎం తెలిపింది. పేటీఎం తన యూజర్లకు ‘న్యూమనీ సేవింగ్‌’ పేరుతో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ సదుపాయంతో యూజర్లు ఎక్కువ నష్టపోకుండా ఉంటారని పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ ప్రకటించింది.

అయితే, ఈ ఆఫర్ కింద తత్కాల్‌ బుకింగ్‌కు మాత్రమే కాకుండా అన్ని రకాల రైలు టికెట్ల బుకింగ్‌పై పూర్తి రిఫండ్ అందించనున్నట్లు సంస్థ తెలిపింది. రద్దు చేసుకున్న వెంటనే సోర్స్‌ అకౌంట్‌కు (డబ్బులు చెల్లించిన కార్డ్, లేదా అకౌంట్‌కు) రిఫండ్‌ అందించనుంది. అంటే, రిఫండ్ కోసం ఎక్కువ రోజులు ఎదురుచూడాల్సిన పని లేదంటూ తెలిపింది. అలాగే, రైలు ప్రారంభానికి 6 గంటల ముందుగా లేదా చార్ట్‌ రూపొందించే ముందు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. అలాగే, రైలు టికెట్లు బుక్ చేసుకునేందుకు యూపీఐతో చెల్లింపులు చేసినట్లయితే, గేట్‌వే ఫీజులు కూడా ఛార్జ్ చేయడం లేదంటూ పేటీఎం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement