Tuesday, May 7, 2024

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు అరెస్ట్ ..

విశాఖ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టిడిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ తెల్లవారుజామునే విశాఖలోని ఆయన నివాసానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. దిశ ఏసీపీ వివేకానంద నేతృత్వంలో గంటా శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ప్రాంతంలో మూడు గంటల హైడ్రామా అనంతరం పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. రోడ్డు మార్గంలో చంద్రబాబును సీఐడీ కార్యాలయానికి పోలీసులు తరలించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement