Monday, May 20, 2024

AP | నేటి నుంచి స్కూళ్లు.. వారంపాటు ఒంటిపూట నిర్వ‌హ‌ణ‌

అమరావతి, ఆంధ్రప్రభ : వేసవి సెలవులు పూర్తికావడంతో బడి గంటలు మోగనున్నాయి. రాష్ట్రంలో సోమవారంనుండి పాఠశాలలు పున:ప్రారంభమవుతాయి. అయితే ఉష్ణోగ్రతలు, వడగాల్పులు అధికంగా ఉండడంతో నేటి నుంచి 17వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 7.30 గంటల నుండి 11.30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈనెల 19వ తేదీ నుంచి విద్యా ప్రణాళిక షెడ్యూల్‌ ప్రకారం పూర్తిస్థాయిలో పాఠశాలలు నడుస్తాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

కాగా పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులందరికీ విద్యా కానుక అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దాదాపు 2,500 రూపాయల విలువ చేసే విద్యా కానుక కిట్‌ అందించే కార్యక్రమాన్ని సిఎం జగన్‌ సోమవారం నాడు పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూర్‌లో ప్రారంభిస్తారు. ఆ తర్వాత అన్ని పాఠశాలల్లోనూ విద్యా కానుక కిట్‌ను పంపిణీ చేస్తారు. ఇప్పటికి 39 లక్షల 90 వేల మంది విద్యార్థులుండగా కొత్తగా చేరే వాళ్లతో కలిపి దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్‌ను సిద్ధం చేశారు. పాఠశాలల పున:ప్రారంభమయ్యే సమయానికి టీచర్ల బదిలీల ప్రక్రియను కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. మొత్తం 83 వేల మంది టీచర్లు బదిలీలకు దరఖాస్తు చేసుకోగా 55 వేల మందికి బదిలీలు జరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement