Saturday, May 28, 2022

రాళ్లపాడుకు పోటెత్తిన వరద.. 5 గేట్లు ఓపెన్ చేసి నీటి విడుద‌ల‌..

ప్ర‌కాశం జిల్లాలోని రాళ్లపాడు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద నీరు వ‌స్తోంది. దీంతో మంగళవారం కొత్త స్పిల్ వేలోని 5 గేట్లను ఓపెన్ చేసి దిగువ‌కు నీటిని విడుద‌ల చేస్తున్నారు. నాలుగు గేట్లను ఐదు అడుగులకు ఎత్తి మరో గేటును 13అడుగులకు ఎత్తి 43 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 40 వేల క్యూసెక్కుల మేర‌ వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

మండలంలోని పెద్దపవని వద్ద ఉప్పుటేరు బ్రిడ్జి పైన నాలుగడుగుల మేర‌ నీరు ప్రవహిస్తోంది. దీంతో చిన్నపవని నుండి పెద్దపవనికి రాకపోకలను నిలిపివేశారు. మేదరమెట్లపాలెం వద్ద భారీగా నీరు రోడ్డు మీదకు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కావలి డిపో బస్సులు లింగసముద్రానికి వచ్చి తిరిగి వెళ్లడానికి వాగులు ఉధృతంగా ప్రవహించడంతో కందుకూరు మీదగా బ‌స్సుల‌ను మ‌ళ్లిస్తున్నారు. రాళ్లపాడు ప్రాజెక్టు నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాల మండలాల, గ్రామాల్లోని అధికారులు అప్రమత్తమయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement