Wednesday, May 15, 2024

AP: మహాశక్తి కింద ఐదు కార్యక్రమాలు… చంద్రబాబు

మహాశక్తి కింద ఐదు కార్యక్రమాలను ప్రవేశపెట్టనున్నట్లు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో పేద విద్యార్థినుల ఉన్నత విద్యకు రుణ సౌకర్యం కల్పించేలా టీడీపీ చేయూతను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కలలకు రెక్కల పథకంలో భాగంగా విద్యార్ధినులతో రిజిస్ట్రేషన్ చేయించారు.


ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కలలకు రెక్కలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆడబిడ్డలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చామన్నారు. డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చిన ఘనత తమదే అన్నారు. ప్రస్తుతం డ్వాక్రా సంఘాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఏడాదికి రూ.15వేల చొప్పున తల్లికి వందనం కార్యక్రమం తీసుకువస్తామన్నారు. ఇంట్లో ఎంతమంది ఉన్నా చదివించే అవకాశం కలుగుతుందన్నారు. మగవారితో సమానంగా ఆడపిల్లలు పని చేస్తున్నారన్నారు.

మగపిల్లల కంటే ఆడపిల్లలకే ఎక్కువ ఆదాయం వస్తోందన్నారు. మెరుగైన అవకాశాలిస్తే మహిళలు మరింత ముందుకెళ్తారన్నారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు వచ్చాయంటే అది ఎన్టీఆర్ చొరవే అన్నారు. ఉద్యోగాల్లో, కళాశాలల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చామన్నారు. ఒకప్పుడు ఐటీ అంటే అందరూ నవ్వారని.. ఇప్పుడు ఐటీలో మనవాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారన్నారు.

- Advertisement -

మహాశక్తి కార్యక్రమంలో భాగంగా తల్లికి వందనం పేరుతో ఏడాదికి రూ. 20 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. దీపం పథకం పేరుతో ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. 18-59 మధ్య వయస్సున్న మహిళలకు ఏడాదికి రూ. 18 వేలు ఇవ్వనున్నామని చంద్రబాబు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement