Saturday, May 11, 2024

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వారానికి అయిదు రోజులు ప‌ని … మ‌రో ఏడాది పొడిగింపు

తాడేప‌ల్లి – ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్‌కు జగన్ శుభ‌వార్త చెప్పారు. హెచ్ఓడీ కార్యాలయాలు, సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ తదితర చోట్ల వర్క్ చేస్తున్న ఎంప్లాయిస్‌కు 5 రోజులు పనిచేసే విధానాన్ని మరో సంవత్సరం పాటు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. నేడు ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఈ ఉద్యోగుల‌కు ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 వరకూ పనివేళలు ఉంటాయి. గతంలో పొడిగించిన గడువు ఈనెల 27తో ముగియనుండటంతో ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు సర్కార్ మరో సంవత్సరం పొడిగించింది. దీంతో సీఎం జగన్‌కు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆయా కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ముఖ్యమంత్రి నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2016లో తొలుత ఈ విధానాన్ని అప్పటి టీడీపీ సర్కార్ ప్రారంభించింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత సచివాలయం ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చేందుకు అప్పుడు ప్రభుత్వం ఐదు రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా మ‌రో ఏడాది పొడిగించింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement