Sunday, May 5, 2024

జాతీయ త్రోబాల్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ కు ఆర్తిక సాయం.. 25లక్షలు అందించిన ఏపీ ప్రభుత్వం

అమరావతి, ఆంధ్రప్రభ: భారత త్రో బాల్‌ జట్టు కెప్టెన్‌ చావలి సునీల్‌కు ప్రభుత్వం రూ. 25లక్షల ఆర్థిక సాయం అందించింది. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కొల్లిపర గ్రామంలో వ్యవసాయ కూలి కుటుంబం నుంచి వచ్చిన సునీల్‌ 2011 నుంచి జాతీయ త్రో బాల్‌ జట్టు కెప్టెన్‌గా పలు విజయాలు అందించారు. రాష్ట్రం నుంచి ప్రతిభ చూపుతూ జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింప చేస్తున్న క్రీడాకారులను ప్రోత్సహించాలని పలుమార్లు అధికారులను సీఎం జగన్మోహన రెడ్డి ఆదేశించారు. సునీల్‌ ప్రతిభను దృష్టిలో ఉంచుకొని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ అభ్యర్థన మేరకు సునీల్‌కు రూ.25లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం క్రీడలు, యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్కే రోజా పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్‌ సమక్షంలో రూ.25లక్షల చెక్కును సురేష్‌కు అందజేశారు.

సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్నమించి జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రతిభ కనబరచడం ద్వారా క్రీడల్లో రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడం గర్వకారణమని మంత్రి రోజా ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా వారి అభివృద్ధికి దోహదపడే చర్యలు సీఎం జగన్మోహన రెడ్డి తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. సునీల్‌కు ఆర్థిక సాయం అందించడం క్రీడా మంత్రిగా తనకు ఎంతగానో ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. తన ప్రతిభను గుర్తించి ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి, క్రీడల మంత్రి ఆర్కే రోజా, ఎంపీ నందిగం సురేష్‌కు ఈ సందర్భంగా సునీల్‌ కృతజ్ఞతలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement