Sunday, April 28, 2024

Fertilizers – ఎరువుల స‌బ్సీడీ త‌గ్గింపుతో అన్న‌దాత కుదేలు…

అమరావతి, ఆంధ్రప్రభ: విపత్తులు.. అతి వృష్టి.. అనావృష్టి.. పండించిన పంటలకు గిట్టు-బాటు- ధర లేకపోవడంతో పెరిగిన ఎరువుల ధరలు అన్నదాతలకు గోరు చుట్టు-పై రోకలి పొటు-లా మారాయి. కేంద్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీని భారీగా తగ్గించింది. నత్రజని, భాస్వరం, పొటాషియం, సల్ఫర్‌లకు కిలో గ్రాముకు ఇప్పుడిస్తున్న సబ్సిడీకి భారీగా కోతలు పెట్టింది. ఇటీ-వలి మంత్రివర్గ సమావేశం అనంతరం ఎరువుల సబ్సిడీని తగ్గిస్తూ నోటిఫికే షన్‌ జారీ అయింది. 2023-24లో సబ్సిడీని తగ్గించడంతో పాటు- 2023లో జనవరి-ఏప్రిల్‌ కాలానికి సబ్సిడీని సైతం సవరించింది. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎరువులు, ఎరువుల తయారీకి ఉపయోగించే ముడిపదార్ధాలు. ఇంధన ధరలు గణనీయంగా తగ్గడమే సబ్సిడీ కోతలకు కారణమని పేర్కొంది. నిరుడు యూరియా ధర టన్ను 627 డాలర్లు (డాలరు ??? 82 రూపాయలు) ఉండగా ప్రస్తుతం 333 డాలర్లుగా ఉంది. అదేవిధంగా డిఎపి రేటు- గతేడాది 925 డాలర్లు కాగా ఈ సంవత్సరం 540 డాలర్లకు తగ్గింది. నిరుడు ధర కంటే ఈ యేడు 42 శాతం మేర తగ్గింది. డిఎపి ధర నిరుడు టన్ను 1030 డాలర్ల కు పెరిగింది. ఫాస్పారిక్‌ యాసిడ్‌, అమ్మోని యా ధరలు ఏడాది వ్యవధిలో 35 శాతం తగ్గాయి.

ఒక్క ఫాస్పారిక్‌ యాసిడ్‌ ధర గతేడాది ఏప్రిల్‌ కంటే ఈ ఏడాది మేలో 35.2 శాతం తగ్గింది. పూల్‌ చేసిన గ్యాస్‌ ధర ఎంఎంబిటియు 28 డాలర్ల నుంచి 13 డాలర్లకు తగ్గింది. ఈ పరిస్థితులే సబ్సిడీ తగ్గింపునకు దారి తీశాయని కేంద్ర ప్రభుత్వం సమర్ధించుకుంటోంది. 2023 – 24 బడ్జెట్‌ అంచనాల్లో ఎరువుల సబ్సిడీ 1.75 లక్షల కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా వేశారు. కాగా కొంత మంది అధికారులు మాత్రం రూ.50 వేల కోట్ల నుంచి 55 వేల కోట్లు- ఎక్కువ ఉండొచ్చని చెబుతున్నారు.

దేశంలో పాత నిల్వలు అధికంగా ఉన్నందున ప్రస్తుత ఖరీఫ్‌లో ఎరువుల ధరలు ఎక్కువే ఉండొచ్చన్న వాదనలూ ఉన్నాయి. అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు తగ్గినప్పటికీ పాత ధరల ప్రాతిపదికన ఎరువుల ఉత్పత్తి జరిగినందున ఖరీఫ్‌లో ధరలు తగ్గకపోవచ్చని, అంతర్జాతీయ పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వం సబ్సిడీ తగ్గిస్తే, రైతులకు ధరలు పెరగడమో లేదంటే ఇప్పుడున్న ధరలే ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో 15 మిలియన్‌ టన్నుల ఎరువుల నిల్వలున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 7.5 మిలియన్‌ టన్నుల యూరియా, 3.6 మిలియన్‌ టన్నుల డిఎపి, 4.5 మిలియన్‌ టన్నుల ఎన్‌పికె నిల్వలున్నాయి. ఇవి ఖరీఫ్‌ అవసరాలకు సరిపోతాయని చెబుతున్నారు.

దేశీయంగా యూరియా ఉత్పత్తి సామర్ధం పెరిగిందని, కొత్త ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమైందని, నానో యూరియాను ప్రవేశపెడుతున్నామని, ఈ కారణాల వలన యూరియా దిగుమతులు గతం కంటే తగ్గుతాయని అంచనా వేశారు. కాగా యూరియా ఉత్పత్తి పెరిగినప్పటికీ దిగుమతులు ఇంకా అవసరమవుతాయని, నానో యూరియా ఇంకా రైతులదాకా వెళ్లలేదని చెబుతున్నారు. ఈ పరిస్థితులన్నీ చక్కదిద్దకుండా ఎరువుల సబ్సిడీ తగ్గింపుపైనే కేంద్రం దృష్టి సారించిందనే విమర్శలు వున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement