Tuesday, May 14, 2024

Dharmavaram – ఈ రైళ్ళు జీవితం కాలం ఆలస్యం

శ్రీ సత్య సాయి బ్యూరో అక్టోబర్ 28: (ప్రభన్యూస్) సాధారణంగా పెద్దలు చెప్పినట్లుగా రైలు రాకడ ప్రాణం పోకడ ఎవరు చెప్పగలరు అన్న చందంగా ధర్మవరం నుంచి మచిలీపట్నం నర్సాపురం అదేవిధంగా మధురై వెళ్లే మూడు రైళ్లు ఆలస్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురైన సంఘటన శనివారం జరిగింది.

ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నుంచి నర్సాపూర్ మచిలీపట్నం వెళ్లే రెండు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు సుమారు ఐదు గంటలకి పైగా ఆలస్యంగా నడుస్తున్నాయి. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ (17248) సాంకేతిక రూపం కారణంగా ధర్మవరం సమీపంలోని రామానుజులపల్లి రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. దీంతో నర్సాపూర్ , మచిలీపట్నం ట్రైన్ నెంబర్ (07096), మధురై వెళ్లే రైలు నంబర్ (22715 )రైళ్లు మూడు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.

. మధురై రైలు మధ్యాహ్నం రెండున్నరకు రావాల్సిందిగా 7:30 గంటలకు కదిరికి వచ్చింది.ఇంజన్లో సాంకేతిక లోపం ,అదే విధంగా విద్యుత్తు లైను లో తలెత్తిన సమస్య కారణంగా రైళ్లు ఆలస్యానికి కారణమని అధికారులు తెలిపారు.ఫలితంగా ముదిగుబ్బ,కదిరి, ములకలచెరువు ,మదనపల్లి రోడ్డు రైల్వే స్టేషన్లో వందల మంది ప్రయాణికులు గంటలు తరబడి పడిగాపులు పడాల్సి వచ్చింది .

- Advertisement -

విషయాన్ని సక్రమంగా ప్రయాణికులకు తెలపడంలో రైల్వే అధికారులు నిర్లక్ష్యం వహించాలని విమర్శలు వెళ్లు వెత్తుతున్నాయి. ప్రధానంగా దసరా సెలవులు అనంతరం గుడివాడ, విజయవాడ, తిరుపతి, నెల్లూరు తదితర ప్రాంతాలలో విద్య నభ్యసించే వారు ముందుగానే బెర్తలను రిజర్వేషన్లు చేసుకుని, ప్రయాణం కోసం సిద్ధమై కదిరి రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ కదిరికి మధ్యాహ్న 3గంటల 15 నిమిషాలకు రావాల్సి ఉండగా ఇప్పటివరకు రాత్రి 7:30 గంటల వరకు ధర్మవరం సమీపంలోని నిలిచిపోయింది. సాయంత్రం నాఊ గంటలకు రావాల్సిన మచిలీపట్నం ఎక్స్ప్రెస్ 7:30 గంటలకు వరకు కదిరికి రాలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement