Wednesday, May 15, 2024

తీవ్ర మనస్తాపం.. రాజీనామాకు సిద్ధ‌ప‌డ్డ మాజీ హోంమంత్రి మేక‌తోటి సుచ‌రిత‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మంత్రివర్గ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ వైసీపీలో ఆగ్ర‌హ జ్వాల‌లు రేపుతోంది. మొన్న‌టిదాకా హోం మంత్రిగా ఉన్న గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే మేకతోటి సుచ‌రిత సీఎం జ‌గ‌న్ సూచ‌న‌ల‌తో రాజీనామా చేశారు. అయితే త‌న‌ ఎస్సీ సామాజిక వ‌ర్గంలోని మిగ‌తా మినిస్టర్స్ అందరినీ కొనసాగిస్తూ.. త‌న‌ను మాత్రం ప‌ద‌వి నుంచి తప్పించడానికి తాను ఏం త‌ప్పు చేశాన‌ని ప్ర‌శ్నిస్తున్నారు.. కాగా, స్పీకర్ ఫార్మాట్​లో ఎమ్మెల్యే పదవికి సైతా రాజీనామా చేయడానికి సిద్ధపడ్డట్టు తెలుస్తోంది. అయితే రెండురోజులుగా తమ కుటుంబసభ్యులు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని కలవడానికి ప్రయత్నించినా పట్టించుకోవడం లేదని పార్టీలో తమకు ఇదేనా ప్రయారిటీ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement