Wednesday, May 1, 2024

మోడల్‌ స్కూల్స్‌ ప్రిన్సిపాల్స్‌కు త్వరలో డీడీవో అధికారాలు..

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 164 మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్స్‌కు త్వరలో డ్రాయింగ్‌ అండ్‌ డిస్బర్సింగ్‌ ఆఫీసర్స్‌ అధికారాలు రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు సిద్ధం చేసింది. దీనిపై మోడల్‌ స్కూల్స్‌ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోమటిరెడ్డి శివశంకర్‌ రెడ్డి, గడపర్తి చంద్రశేఖర్‌ హర్షం వ్యక్తం చేశారు.

ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సూత్రపాయంగా అంగీకారం తెలిపారని, ప్రిన్సిపాల్స్‌కు డీడీఓ అధికారాలు ఇవ్వడంపై 15 రోజులలోగా కార్యాచరణ మార్గదర్శకాలు తయారుచేసి మళ్లీ ఆర్థికశాఖ తుది ఆమోదం కోసం పంపించాలని విద్యాశాఖ అధికారులకు మెమో జారీచేశారన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, ఆర్థికశాఖ అధికారులకు, విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మోడల్‌ స్కూళ్లను పాఠశాల విద్యలో విలీనం చేసి టీచర్లకు 010 పద్దు కింద జీతాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement