Thursday, April 25, 2024

న‌వ్వు పుట్టిస్తున్న థ‌మ‌న్ డ్యాన్స్‌.. స‌ర్కారువారి పాట కోసం కొత్త స్టెప్పులు..

డ్యాన్స్ మాస్ట‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్ అంటే అంద‌రికీ తెలుసు.. అత‌ని కొత్త కొత్త స్టెప్పులు అంటే చాలా మంది లైక్ చేస్తారు. చిరంజీవికి వీణ స్టెప్పు, బెల్టు స్టెప్పు.. సాయి ధ‌ర‌మ్ తేజ్‌కి చేయి పైకి లేపి వేసే స్టెప్పు.. బ‌న్నీకి కూడా బోలెడ‌న్ని వెరైటీ స్టెప్పులేయించారు.. చాలా పాట‌ల‌కు శేఖ‌ర్ మాస్ట‌ర్ డిఫ‌రెంట్ స్టెప్స్ వేయిస్తుంటారు.. అయితే స‌ర్కారువారి మూవీలో ఓ పాట‌కు మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ తో క‌లిసి స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒక‌టి ఇన్‌స్టాలో షేర్ చేశారు.

ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ వీడియోలో శేఖ‌ర్ మాస్ట‌ర్‌కు పోటీగా థ‌మ‌న్ చేస్తున్న డ్యాన్స్ అంద‌రినీ న‌వ్వుకునేలా చేస్తోంది.. మీరూ చూసి ఎంజాయ్ చేయండి…

Advertisement

తాజా వార్తలు

Advertisement