Saturday, May 4, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

తిరుమల, ప్రభన్యూస్‌ : తమిళులకు అత్యంత ముఖ్యమైన పెరటాసినెల చివరి శనివారం కావడంతో సప్తగిరులకు భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమలలో ఎటుచూసిన భక్తులు కిటకిటలాడుతున్నారు. రోడ్డుమార్గాన, రెండు కాలిబాటమార్గాలలో భక్తులు వెల్లువలా తిరుమలకు చేరుకుంటున్నారు. శ్రీవారి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్టుమెంట్లు పూర్తిగానిండి నారాయణగిరిలో ఏర్పాటుచేసిన షెడ్లు నిండి ఆళ్వార్‌ ట్యాంక్‌ క్యూ లైన్‌లో భక్తులు బారులుతీరారు. దీంతో సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలంటే సుమారు 20 గంటలకు పైగా సమయం వేచివుండాల్సి వస్తుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు సమయం వేచివుండి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. బ కాగా క్యూ లైన్‌లో వేచివున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందేలా ‘టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement