Monday, April 29, 2024

కమాన్​రా బాద్​షా.. గుర్రపు స్వారీలో సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి తనయుడి ప్రతిభ

సినిమాల్లో హీరోలు గుర్రపు స్వారీ చేయడం చూశాం.. కొదమ సింహంలో చిరంజీవి, మగధీరలో రాంచరణ్​.. ఇంకా చాలామంది హీరోలు గుర్రపు స్వారీ చేశారు. ఇక టక్కరిదొంగలో అయితే మహేశ్​ బాబు హార్స్​ రైడింగ్​ చూసి జనాలు మస్త్​ ఎంజాయ్​ చేశారు.. వారి ఎంట్రీ సన్నివేశాన్ని ఎన్నిసార్లు చూసినప్పటికీ కూడా ప్రేక్షకులు ఇప్పటికీ మైమరిచి పోతుంటారు.. అయితే.. నిండా ఏడేళ్లు కూడా నిండని ఓ బుడ్డోడు.. అదే స్టైల్​లో గుర్రంపై స్వారీ చేస్తూ తెగ ఎంజాయ్​ చేస్తున్నాడు. గుర్రాలను చూస్తే జడుసుకునే ఏజ్​లోనే ‘‘కమాన్​రా బాద్​షా’’ అంటూ గుర్రంపై దౌడు తీస్తున్నాడు. ఇది చూసిన జనం వావ్​ అంటూ నోరెళ్లబెట్టి చూస్తూ సంబ్రమాశ్యర్యాలకు గురవుతున్నారు.

అయితే.. ఈ చిన్నోడు ఎవరో తెలిస్తే మీరు షాక్​ అవక తప్పదు.. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం మాజీ జెఈవో డాక్టర్ బి. లక్ష్మీకాంతం, శోభాలతల ముద్దుల మనవడు ఈ బుడ్డోడు. తమిళనాడు రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా సేవలందిస్తున్న వీరరాఘవ రావు, హాసంతికాల గారాల తనయుడు. నిండా ఏడు ఏళ్లు కూడా లేని విష్ణుజిత్ గుర్రపు స్వారీలో అందరినీ ఆశ్యర్యపోయేలా చేస్తున్నాడు. చూసేవారి అభినందనలు సొంతం చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా పలువురు మాస్టర్ విఘ్ణజిత్ భవిష్యత్తులో మరిన్ని గుర్రపు స్వారీ పోటీలలో పాల్గొని కీర్తి ప్రతిష్టలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement