Saturday, December 7, 2024

రూ.2.50పెరిగిన సీఎన్‌జీ ధర.. స్థిరంగా పెట్రోధరలు

న్యూఢిల్లి : సీఎన్‌జీధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. గురువారం ఢిల్లిdలో సీఎన్‌జీ ధరలు కిలోకు రూ.2.50 పెరిగాయి. ఈ పెంపు తర్వాత ఢిల్లిలో సీఎన్‌జీ ధర కిలోకు రూ.69.11కి పెరిగింది. గత 2 రోజుల్లో, ఇంద్రప్రస్థ గ్యాస్‌ లిమిటెడ్‌ సీఎన్‌జీ ధరలను కిలోకు రూ.5 పెంచింది. ఏప్రిల్‌లో ఇది మూడో పెంపు. కాగా ఈ నెలలో మొత్తం కిలో రూ.9.10 పెరిగింది. సహజవాయువు ధరల పెరుగుదల కారణంగా సీఎన్‌జీ ధరలను పెంచుతున్నాయి. ఏప్రిల్‌ 1న 80పైసలు పెరిగింది. దీని తర్వాత ఏప్రిల్‌ 4న కిలోకు రూ.2.50 పెరిగింది.ఆ తర్వాత ఏప్రిల్‌ 6న దీని ధర రూ.2.50 పెరిగింది. హైదరాబాద్‌లో రూ.75.75 ఉండగా విజయవాడలో రూ.74.75 ఉంది. నోయిడా, గ్రేటర్‌ నోయిడా, ఘజియాబాద్‌లలో కిలో ధర రూ.71.67గా ఉంది. ముజఫర్‌ నగర్‌, మీరట్‌, షావ్లిdులో రూ.76.34కు విక్రయిస్తున్నారు.

గురుగ్రామ్‌లో సీఎన్‌జీ ధర కిలోకు రూ.77.44కు పెరిగింది.కాగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో చమురు కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. దేశంలోని అతిపెద్ద చమురు మార్కెటింగ్‌ కంపెనీ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) ప్రకారం దేశరాజ ధాని ఢిల్లిdలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.10.5.41. లీటర్‌ డీజిల్‌ ధర రూ.96.67 గా ఉంది.#హదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 119.49గా ఉండగా, డీజిల్‌ రూ.105.49 వద్ద కొనసాగుతోంది. విశాఖటపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.120 కాగా, డీజిల్‌ రూ.105.65 వద్ద ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement