Saturday, May 4, 2024

Breaking: ఏపీ తొలి కేబినెట్ చివరి భేటీ.. నేడు మంత్రులంతా రాజీనామాలు

ఏపీ నేడు చివరిసారి సమావేశం కానుంది. వైసీసీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఏర్పడిన తొలి కేబినెట్​.. చివరి సమావేశం ఇవాళ జరుగనుంది. నూతన మంత్రివర్గంపై తుది కసరత్తు చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 36 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో కేబినెట్ మంత్రులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజీనామా కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులంతా రాజీనామాలు సమర్పించనున్నారు. వారి స్థానంలో ఈ నెల 11న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. 

ప్రమాణ స్వీకారం రోజే మంత్రులంతా రెండున్నరేళ్ల వరకే కొనసాగుతారని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించినందున ఈ మార్పుచేర్పులు చేస్తున్నారు. మంత్రులుగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపై కసరత్తు పూర్తి చేసిన సీఎం… గవర్నర్‌ను నిన్న కలిసి సమగ్రంగా చర్చించారు. ఈ నెల 11న కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని కోరారు. అయితే, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజులలో ముగ్గురు, లేదంటే నలుగురిని మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement