Saturday, April 27, 2024

Breaking: రేపు ఢిల్లీకి ఏపీ సీఎం.. ప్రధాని మోదీతో జగన్ భేటీ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో సీఎం భేటీ కానున్నారు. అలాగే ఈ నెల 30వ తేదీన జరుగనున్న జ్యుడీషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ సమావేశానికి ప్రధాని, సీజేఐ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. దేశంలో న్యాయ మౌలిక సదుపాయాల కల్పన, కేసుల సత్వర పరిష్కారంపై సెమినార్ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement