Tuesday, May 7, 2024

నైపుణ్యం దిశగా తొలి అడుగు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి స్కిల్ ట్రైనింగ్ అకాడమీ కడప జిల్లా పులివెందులలో ఏర్పాటు కానుంది. దివంగత మాజీ సీఎం వైయస్సార్ జయంతి సందర్భంగా స్కిల్ ట్రైనింగ్ అకాడమీకి సీఎం వైఎస్ జగన్ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో 7 ఎకరాల విస్తీర్ణంలో రూ.30 కోట్ల ఖర్చుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనుంది. వైయస్సార్ జయంతి నాడు ముఖ్యమంత్రి నైపుణ్య కల సాకారానికి మొదటి అడుగు పడటం మంచి పరిణామం అని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఉపాధి అవకాశాల కోసం రాష్ట్ర యువత ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం అని తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 25 నైపుణ్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుడతామని వెల్లడించారు. మరో 5 మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ లకూ శ్రీకారం చుట్టనున్నామని చెప్పారు.

వివిధ రంగాలకు సంబంధించిన పరిశ్రమలలో ఉపాధి అవకాశాలకు తగ్గట్లు అత్యాధునిక హంగులతో హైఎండ్ ల్యాబ్ల స్థాపనకు పులివెందుల స్కిల్ డెవలప్మెంట్ అకాడమీని నైపుణ్య శాఖ తీర్చిదిద్దనుంది. నైపుణ్య కళాశాలలో యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలను పెంచేలా సాంకేతిక ,శిక్షణ , అత్యాధునిక కోర్సులు, కొత్త కరికులమ్ ను ఏర్పాటు చేయనున్నారు. పులివెందుల స్కూల్ అకాడమీ ఆర్కిటిక్ డిజైనింగ్ బాధ్యతలను ఏపీయూఐఏఎమ్ఎల్ నిర్వర్తిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement