Saturday, April 27, 2024

Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు.. ముందస్తు చర్యలపై సీఎం ఆదేశాలు

బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీని ప్రభావం ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై కూడా పండింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాల నేపథ్యంలో సీఎం  జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీలోని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో తాడేపల్లిలోని తాన క్యాంప్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. తడ, సూళ్లూరుపేట సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. తమిళనాడు సరిహద్దుల్లో ఆప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకున్నాయని, కర్నూలులో మరో రెండు బృందాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. మంగళగిరిలో కూడా అదనపు బృందాలు సిద్ధం చేశామని చెప్పారు. పరిస్థితులను బట్టి వారి సేవలను వినియోగించుకోవచ్చని సీఎం జగన్ సూచించారు.

ఇది కూడా చదవండి: idol of Annapurna: వందేళ్ల తర్వాత యూపీ చేరిన అన్నపూర్ణ దేవి విగ్రహం!

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి  https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement