Thursday, April 25, 2024

స‌బ్బు ఖ‌రీదు రూ.2.7ల‌క్ష‌లు..ప్ర‌త్యేక‌త‌లేంటో తెలుసా..

స‌బ్బుల్లో ఎన్నో ర‌కాలు ఉన్నాయి. స్నానానికి వాడే వాటిల్లో ఇప్పుడు మ‌రింత రంగు,వాస‌న‌ల క‌ల‌బోత‌తో స‌బ్బుల‌ను త‌యారు చేస్తున్నారు ప‌లు కంపెనీల వారు. అయితే స‌బ్బు ఖ‌రీదు ఎంతుంటుంది. మ‌హా అయితే వంద లేదంటే 500. ఇంత వ‌ర‌కు మ‌న‌కి తెలుసు. కానీ ఒంటికి వాడే స‌బ్బు ఖ‌రీదు ల‌క్ష‌ల్లో ఉంటుంద‌ని మీకు తెలుసా..మ‌రి ఈ సోప్ కి ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు కూడా ఉన్నాయండోయ్. ఆ వివ‌రాలు చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సోప్.. కాస్ట్ ఎంతో తెలుసా అక్షరాల రూ.2.7లక్షలు. స‌బ్బు రేటు ల‌క్ష‌లా అనుకోకండి..

మ‌రి ఇది ఎక్క‌డ త‌యార‌వుతుందో తెలుసా..లెబానోన్‌లోని ట్రిపోలీకి చెందిన ఒక కుటుంబానికి సబ్బులు ఫ్యాక్టరీ ఉంది.అందులో ఈ రకమైన సోప్స్ తయారుచేస్తారట. 15వ శతాబ్ధం నుంచే ఈ సబ్బులు వాడకంలో ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఈ సబ్బు వాడిన వారికి ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతత కలుగుతుందట‌. అయితే దీనిని రుజువుచేసే ఆధారాలైతే ఏం లేవు.ఇంత డబ్బు పెట్టి దీన్ని వాడేవారు ఉంటారా అనిపిస్తుందా.. డబ్బులు ఎక్కువగా ఉన్నవాళ్లకు ఇదేం పెద్ద మ్యాటర్ కాదు..ముఖ్యంగా విఐపీలు, సెలబ్రెటీలు మాత్రమే వీటిని వాడుతారట. దుబాయ్‌లో నివసించే సంపన్న కుటుంబాలు ఎక్కువగా ఈ సబ్బులను వాడుతారని టాక్.

మ‌రి ఈ ఖ‌రీదైన సోప్స్ ఎప్పుడు త‌యార‌య్యాయో తెలుసా.. 2013 లో ..దీనిని ఖతార్ అధ్యక్షుడి భార్యకు బహుమతిగా ఇచ్చినట్లు మీడియా స‌మాచారం. ఈ లగ్జరీ సబ్బు పేరు ‘ఖాన్‌ అల్‌ సబౌన్‌’ సోప్‌. బాడర్‌ హసీన్‌ అండ్‌ సన్స్‌ కంపెనీ కేవలం చేతులతోనే ఈ సబ్బులను తయారు చేస్తుందట. ప్రత్యేకమైన నూనెలు, సహజ సువాసనలతో కూడిన చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారు చేయడంలో ఈ కంపెనీ ప్రసిద్ధి. ఈ కంపెనీ ఉత్పత్తులు కేవలం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని కొన్ని ప్రత్యేక షాపుల్లో మాత్రమే దొరుకుతుండటం విశేషం. ఈ సోప్ ఎందుకు ఇంత కాస్ట్ అంటే..దీనిని బంగారం, వజ్రాల పొడుల‌తో తయారు చేస్తారట. ఒక ఖాన్‌ అల్‌ సబౌన్‌ సబ్బు తయారీకి 17 గ్రాముల, 24 క్యారెట్ల బంగారం, 3 గ్రాముల వజ్రాల పౌడర్‌లో సహజమైన నూనెలు, సహజసిద్ధమైన తేనె, ఖర్జూరం కలిపి తయారు చేస్తారట. చూడ్డానికి అచ్చం జున్ను ముక్కలా ఉంటుందీ స‌బ్బు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement