Monday, May 6, 2024

శ్రీనివాససేతు ఫ్లై ఓవర్ బ్రిడ్జి తో తిరుపతి వాసుల ట్రాఫిక్ కష్టాలకు తెర – జగన్

తిరుపతి – శ్రీనివాససేతు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వల్ల తిరుపతి వాసుల ట్రాఫిక్ కష్టాలకు తెరపడతుందని తెలిపారు సీఎం జగన్. . తిరుపతిలో నగరంలో నిర్మించిన శ్రీనివాససేతు ఫ్లై ఓవర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ,తాను అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన చేసి నాలుగేళ్లలో పూర్తి చేశామని చెప్పారు. దాదాపు 6 వేల 700 మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పారు.మరో 3 వేల 500 మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. నెల నుంచి 45 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారని సీఎం జగన్ పేర్కొన్నారు. దాదాపు రూ.1300 కోట్లతో తిరుపతిని అభివృద్ధి చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు

కాగా, రూ..684 కోట్లతో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించడంతో పాటు ఎస్వీ కాలేజీ హాస్టల్ భవనం ప్రారంభోత్సవంతో పాటు టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పట్టాలు కూడా సీఎం జగన్ పంపిణీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement