Monday, September 25, 2023

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో నారా లోకేష్ ఆధ్వ‌ర్యంలో టీడీపీ ఎంపీల ధర్నా

.ఢిల్లీలోని పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో నారా లోకేష్ ఆధ్వ‌ర్యంలో టీడీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు సోమవారం ఆందోళన నిర్వహించారు.చంద్ర‌బాబు అరెస్ట్‌పై పార్ల‌మెంట్ గాంధీ విగ్ర‌హం వ‌ద్ద ఆందోళ‌న చేసిన టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌, టీడీపీ ఎంపీలు కేశినేని నాని,రామ్మోహ‌న్ నాయుడు, గ‌ల్లా జ‌య‌దేవ్‌, క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్‌, మాజీ ఎంపీలు కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌, నిమ్మ‌ల కిష్ట‌ప్ప‌, కాల్వ శ్రీనివాసులు, వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామ‌కృష్ణంరాజు లు ఉన్నారు.

- Advertisement -
   

ఎంపీ శ్రీ కేశినేని నాని మాట్లాడుతూ 45 ఏళ్లుగా దేశ రాజకీయాల్లో నిజాయితీ క‌లిగిన గొప్ప వ్య‌క్తి చంద్ర‌బాబు అన్నారు. దేశంలో ఏ వ్య‌క్తిని అడిగిన చంద్ర‌బాబు త‌ప్పు చేశార‌నే స‌మాధానం రాదన్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని, విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని ఎంతో అభివృద్ధి చేసిన వ్య‌క్తి చంద్రబాబు నే అన్నారు. 45 ఏళ్లు రాజకీయ జీవితంలో అవినీతి మ‌చ్చ‌లేని వ్య‌క్తి చంద్ర‌బాబు అలాంటి వ్య‌క్తిని అక్ర‌మంగా, ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారన్నరు.జ‌గ‌న్ ల‌క్ష‌కోట్లు దోచాడ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి కాబ‌ట్టి చంద్ర‌బాబు కి కూడా ఏదో ఒక నింద వేయాల‌ని జ‌గ‌న్ చేసిన కుట్ర ఇది అన్నారు. చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.న్యాయం జ‌రిగే వ‌ర‌కు ధ‌ర్మం గెలిచే వ‌ర‌కు పోరాటం ఆగ‌దు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement