Saturday, April 27, 2024

మాజీ మంత్రి నారాయ‌ణ కుమార్తె ఇంట్లో సీఐడీ సోదాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ మాజీ మంత్రి, టీడీపీ నేత‌ నారాయణ కుమార్తె ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, కొండాపూర్‌, గచ్చిబౌలిలో ఉన్న‌ ఆమె నివాసాల్లో సీఐడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అమరావతి భూముల కొనుగోలు అంశంలో ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement