Saturday, April 27, 2024

పెళ్ళి పీట‌లెక్కిన రాకేష్.. సుజాత

ఎట్ట‌కేల‌కు పెళ్ళిపీట‌లెక్కారు రాకింగ్ రాకేష్.. జోర్దార్ సుజాత‌.వీరి వివాహానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ పెళ్లికి కేవలం ఇరువురు కుటుంబ సభ్యులు, జబర్థస్త్ కమెడియన్ ల సమక్షంలోనే జరిగినట్లుగా సమాచారం. ఈ వేడుక తిరుపతిలో జరిగినట్లు తెలుస్తోంది.. దాదాపుగా 20 ఏళ్ల క్రితమే హైదరాబాద్ కు వచ్చిన రాకేష్ మిమిక్రీ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు సంపాదించారు. చాలా చోట్ల షోలు చేసి మంచి పాపులారిటీ అందుకున్న రాకేష్.. ధనరాజు టీం లో ఒక కమెడియన్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు . ఆ తర్వాత కిరాక్ ఆర్పి.. రాకింగ్ రాకేష్ పేరుతో టీమ్ కూడా లీడ్ చేశారు. ఇక ఆర్పి వెళ్లిపోవడంతో సింగిల్ గా టీం లీడర్ గా మారిపోయారు.. ఇక అప్పటినుంచి కొన్నేళ్లపాటు తన కామెడీతో ప్రేక్షకులను బాగా నవ్వించారు. ఇక సుజాత కూడా బిగ్ బాస్ లో పాల్గొని మంచి క్రేజ్ సంపాదించింది. రాకేష్ తో ఈమెకు ముందు నుంచి పరిచయం ఉంది కాబట్టి జబర్దస్త్ షోలోకి అడుగు పెట్టింది.. దీంతో రాకేష్ టీం లో స్కిట్లు చేస్తూ వస్తున్న సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా వీరి ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement