Friday, May 3, 2024

తిరుపతి టౌన్ బ్యాంక్ కు పూర్వ వైభవం తీసుకొస్తాం : ఎమ్మెల్యే భూమన

తిరుపతి సిటీ : వందేళ్లు చరిత్ర కలిగిన తిరుపతి కోపరేటివ్ బ్యాంకును పూర్వ వైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలియజేశారు. శనివారం ఆయన విస్తృతంగా అభ్యర్థులతో కలిసి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పూల వీధి, పల్లె వీధి, ప్రాంతాల నందు తిరుపతి బ్యాంకు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నాగర్ మేయర్ డాక్టర్ శిరీష్ యాదవ్ కలిసి ఎన్నికల ప్రచార రథాన్ని ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈనెల 20వ తేదీ జరగనున్న టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ బలపరిచిన 12 మంది డైరెక్టర్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని ఖాతాదారులకు అభ్యర్థిస్తున్నా అన్నారు.. జగనన్న ప్రభుత్వంపై టీడీపీ నాయకులు పనిగట్టుకుని విషం కక్కుతున్నారు.

టీడీపీ వాళ్ళు చేస్తున్న విమర్శలను ప్రజలు ఎవరూ పట్టించుకోవడం లేదు. జగనన్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు. టౌన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారానికి వెళుతున్నప్పుడు వారు మమ్మల్ని నిండు మనస్సుతో స్వాగతిస్తూ ఆదరిస్తున్నారు. వైఎస్సార్ సీపీ బలపరుస్తున్న అభ్యర్థులకే ఓట్లు వేస్తామని ముక్తకంఠంతో చెబుతున్నారు.
తిరుపతి టౌన్ బ్యాంకును టీడీపీ నాయకులు, వారి కనుసన్నల్లో నడిచిన పాలక మండలి సర్వనాశనం చేశారు. అందుచేత వారికి మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు లేద‌న్నారు. వైఎస్సార్సీపీ బలపరుస్తున్న డైరెక్టర్లు అభ్యర్థులు చాలా ఉత్సాహంతో పని చేస్తారు. 12 కి 12 మందీ పని చేసే సామర్థ్యం కలిగిన వారే ఉన్నారు. ఈ పాలకమండలి అధికారంలోకి రాగానే ఖాతాదారులకు మెరుగైన, పారదర్శక పాలన అందించడం జరుగుతుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అభ్యర్థులు కేతం జయచంద్రా రెడ్డి, రేమాల బ్రహ్మానంద రెడ్డి, పోలిరెడ్డి నాగిరెడ్డి, అనిల్ రాయల్, మబ్బు నాధముని రెడ్డి, వాసుదేవ యాదవ్, వెంకటేష్ రాయల్, మాకం చంద్రయ్య, వేమూరి జ్యోతి ప్రకాష్, కాసీం, సురేష్ కుమార్ రెడ్డి, అమర నాధరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement