Sunday, May 5, 2024

నారాయణ కళాశాల విద్యార్థుల వీరంగం

తిరుపతి సిటీ : ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులే.. తిరుపతి నగరంలోని డి.బి.ఆర్. హాస్పిటల్ రోడ్ లోని నారాయణ కళాశాలకు సంబంధించి ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఒక అమ్మాయితో చనువుగా ఉన్నాడని అక్కడ పనిచేస్తున్నటువంటి లెక్చలర్ చూసి ప్రిన్సిపాల్ కు చెప్పడంతో ఆ అబ్బాయిని పిలిపించి మందలించడంతో అబ్బాయి జరిగిన అవమానాన్ని తోటి విద్యార్థులకు చెప్పడంతో అందరూ కలిసి కళాశాలలో ఉన్న సీసీ కెమెరాలు. లైట్లు. ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో ఒక్కసారిగా ఆందోళన చెందిన కళాశాల విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. అక్కడ ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కళాశాల సిబ్బంది ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. బ్లూకోర్టు సంఘటనా స్థలానికి వచ్చి విద్యార్థులను మందలించడంతో వ్యవహారం సద్దుమణిగింది. ఇదిలా ఉండగా అమ్మాయి. అబ్బాయి చనువుగా ఉన్నారని తెలుసుకున్న ప్రిన్సిపాల్ అమ్మాయి తల్లిదండ్రులను పిలిపించి అమ్మాయిని ఇంటికి పంపించడం జరిగింది.. అక్కడ జరిగినటువంటి ఫర్నిచర్ నష్టాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. విద్యార్థులపై కేసులు పెడతామని బెదిరించడంతో పాటు వాళ్ల దగ్గర నష్టపరిహారం చెల్లించేలా కళాశాల యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement