Friday, April 26, 2024

క‌రోనా మృత‌దేహాల‌కు అంత్యక్రియలు నిర్వ‌హిస్తున్న పాపులర్ ఫ్రంట్ అఫ్ ఇండియా

సోమల – మండలం పరిధి లోని కందూరు లో కరోనాతో మృతిచెందిన వ్యక్తికీ వారి సంప్రదాయం ప్రకారం గురువారం అంత్యక్రియలుపాపులర్ ఫ్రంట్ అఫ్ ఇండియా ఆధర్యంలో నిర్వహిచడం జరిగింది .కరోనా రెండవ దశ అతి త్వరగా విజృంభించి ప్రజల మరణానికి కారణమౌతున్నది .ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులలో పాపులర్ ఫ్రంట్ అఫ్ ఇండియా సభ్యులు రంజాన్ నెలలో ఉపవాసం ఉంటూ మండుటెండను లెక్కచేయకుండా ప్రాణాలను సహితం పణంగాపెట్టి కులమతాలకు అతీతంగా కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను వారి సంప్రదయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తూ ప్రజల గుండెల్లో చిరస్తాయిగా స్తానం సంపాదించుకొన్నారు. వల్లి గట్ల పంచాయతీ గల్లావారి పల్లి లో కరోనాతో మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగికి హిందూ సాంప్రదాయం ప్రకారం గురువారం అంత్యక్రియలు నిర్వహించారు .ఈ కార్యక్రమాలను జిల్లా మొత్తం తమ సొంత ఖర్చుతో నిర్వహిస్తున్నారు . ఈ టీమ్ మొత్తం 25 మంది సభ్యులుగా పాపులర్ ఫ్రంట్ అఫ్ ఇండియా వారియర్స్ గా రాత్రి పగలు అంత్యక్రియలు నిర్వహించడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్చులు చాంద్ భాష .కార్యదర్శి అన్వార్ భాష .జబీ ఉల్లా, జమీర్, ఫైజుల్లా .సలీమ్ ఖమ్రుద్దీన్ లు పొల్గొన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement